Mohanlal: మలయాళ స్టార్ హీరో ఒక్కసారిగా ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వడం సినిమా ఇండస్ట్రీలో కలకలంగా మారింది. ఆదివారం మోహన్ లాల్ కు ఒక్కసారిగా శ్వాస తీసుకొవడంతో ఇబ్బందిగా అన్పించడంతో హుటా హుటీన ఆస్పత్రికి తరలించారు.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆదివారం ఒక్కసారిగా ఆయనకు శ్వాస తీసుకొవడంతో సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు.. కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి తరలించారు.
ఆయనకు విపరీతమైన జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆయనకు వైరల్ ఫీవర్ కూడా ఉన్నట్లు సమాచారం. ఆయనకువైద్యులు అనేక టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్న.. వారంపాటు మాత్రం విశ్రాంతి తీసుకొవాలని డాక్టర్ లు సూచించినట్లు తెలుస్తొంది.
మోహన్ లాల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సంఘటన మలయాళ ఇండస్ట్రీలో అందరిని ఒక్కసారిగా టెన్షన్ కు గురిచేసింది. ఆయన అభిమానులు సైతం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు ఆయన తొందరగా కొలుకొవాలంటూ కూడా ప్రత్యేంగా పూజలు సైతం చేస్తున్నారంట.
ఇదిలా ఉండగా.. మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం బరోజ్. ఈ మూవీ.. అక్టోబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జులైలో వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడడంతో.. వందలాది మంది మరణించారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
మోహన్ లాల్.. వయనాడ్ పర్యటించి.. భారత సైన్యంతో కలిసి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా.. సహాయ పునరావాస చర్యల కోసం రూ. 3 కోట్ల ఆర్థిక సాయాన్ని నటుడు మోహన్ లాల్ ప్రకటించారు.
భారత్ సైన్యం.. ఇటీవల..మోహన్ లాల్ కు.. ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఇచ్చారు. దీనిలో భాగంగానే ఆయన.. భారత సైన్యంతో కలిసి ఆయన వయనాడ్ జిల్లాలో పునారావాస చర్యల్లో పొల్గొన్నారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చేరడం మాత్రం ఫ్యాన్స్ ను ఒకింత ఆందోళ కల్గించిందని చెప్పుకొవచ్చు.