CNG SUV CARS: మార్కెట్లో త్వరలో కొన్ని ఎస్యూవీ కార్లను సీఎన్జీ వేరియంట్‌తో ప్రవేశపెడుతున్నాయి. వీటిలో మారుతి సుజుకి వాహనాలు రెండు, టాటా మోటార్స్ , కియా మోటార్స్ ఒక్కొక్క మోడల్ ఉన్నాయి. సీఎన్జీ ఆధారిత ఎస్యూవీ కార్ల వివరాలు మీ కోసం..
టాటా పంచ్ సీఎన్జీ టాటా మోటార్స్ కూడా ఆటో ఎక్స్‌పోలో పంచ్ సీఎన్జీ లాంచ్ గురించి వెల్లడించింది. 1.2 లీటర్ 3 సిలెండర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు సీఎన్జీ ఆప్షన్లో ఉంది. 5 స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంటుంది. ఇందులో 60 లీటర్ సీఎన్జీ ట్యాంక్ ఉంది.
మారుతి సుజుకి ఫ్రాన్క్స్ సీఎన్జీ మారుతి ఇటీవలే ఫ్రాన్క్స్ ఎస్యూవీను ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టింది. పెట్రోల్ ఇంజన్ ఫ్రాన్క్స్ బుకింగ్ ప్రారంభమైంది. వచ్చే నెల లాంచ్ ఉంది. త్వరలో సీఎన్జీ వేరియంట్ అందుబాటులో వస్తోంది. ఇందులో 1.2లీటర్ 4 సిలెండర్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి బ్రెజ్జా సీఎన్‌జి మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి బ్రెజా సీఎన్జీ గురించి వెల్లడించింది. వచ్చే నెలలో ఈ వేరియంట్ లాంచ్ కానుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, సీఎన్డీ కిట్‌తో వస్తోంది. సీఎన్జీ మోడల్లో మేన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండూ ఉన్నాయి.
కియా సోనెట్ సీఎన్జీ ఇటీవలే కియా మోటార్స్ తన సీఎన్జీ మోడల్ పరీక్షించింది. వచ్చే నెలలో లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. పెట్రోల్ ఇంజన్‌తో పోలిస్తే సీఎన్జీ మోడల్ ధర 1 లక్ష రూపాయలు అధికం కావచ్చు.
ఇండియాలోని కార్ల కంపెనీలు ఇప్పుడు సీఎన్‌జీలపై ఫోకస్ పెడుతున్నాయి. మారుతి సుజుకి ఇందులో ముందు వరుసలో ఉంటుంది. మార్కెట్లో త్వరలో సీఎన్జీ ఆధారిత ఎస్‌యూవీలు అందుబాటులో వస్తున్నాయి. రెండు మోడల్స్ మారుతి సుజుకీ అయితే..టాటా మోటార్స్, కియా మోటార్స్ మోడల్స్ ఒక్కొక్కటి ఉన్నాయి.