Harish rao: తెలంగాణ మంత్రి..టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు బ్యాట్ పట్టారు. రాజకీయాల్లోనే కాదు క్రికెట్ లో కూడా తీసిపోలేదని నిరూపించారు. పిచ్ లో వస్తూనే బౌండరీలు కొట్టారు.
Harish rao: తెలంగాణ మంత్రి..టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు బ్యాట్ పట్టారు. రాజకీయాల్లోనే కాదు క్రికెట్ లో కూడా తీసిపోలేదని నిరూపించారు. పిచ్ లో వస్తూనే బౌండరీలు కొట్టారు.
సిద్దిపేటలోని మినీ స్టేడియంలో టీ 20 ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్.. సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ మధ్య మ్యాచ్ జరిగింది.
డిఫెన్స్, స్క్వేర్ కట్, స్ట్రైట్ డ్రైవ్ లతో ప్రొఫెషనల్ బ్యాట్స్ మెన్ గా రాణించారు మంత్రి హరీశ్ రావు.
నిన్నటి వరకూ దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన మంత్రి హరీశ్ రావుకు ఈ మ్యాచ్ కాస్త ఆటవిడుపుగా మారింది.
166 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన డాక్టర్స్ జట్టు..లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 16 పరుగుల తేడాతో సిద్దిపేట జట్టు విజయం సాధించింది.
నెంబర్ 4 గా బరిలో దిగిన మంత్రి హరీశ్ రావు 12 బంతుల్లో 3 ఫోర్ల కొట్టి..18 పరుగులు సాధించి..బ్యాటింగ్ పవర్ ఏంటో నిరూపించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన సిద్దిపేట జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది.
డాక్టర్ల జట్టుకు కృష్ణ కిరణ్ సారథ్యం వహించగా.. సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ కు మంత్రి హరీశ్ రావు నేతృత్వం వహించారు.