Indian cricketers who announced their retirement in 2020: ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా దాదాపు 7 నెలలపాటు క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించలేదు. ముఖ్యంగా క్రికెట్‌కు సంబంధించి పలువురు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మొత్తం 10 మంది భారత క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించగా.. అందులో అయిదుగురు టీమిండియా క్రికెటర్లు ఉన్నారు. 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్లు వీరే..
ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్లలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) ముందు వరుసలో ఉంటాడు. ఐపీఎల్ 2020కు సన్నద్ధమయ్యే సమయంలో వన్డే, టీ20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. గతంలోనే టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. Also Read: India vs Australia 3rd Test: ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు.. వార్నర్ ఖాయం
టీమిండియా(Team India) బౌలర్, ‘స్వింగ్ సుల్తాన్’ ఇర్ఫాన్ పఠాన్ జనవరి 4వ తేదీన క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆల్ రౌండర్‌గా మారిన తర్వాత అతడి బౌలింగ్ కెరీర్ సైతం ప్రమాదం పడింది. జట్టుకు దూరమైన ఇర్షాన్ పఠాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కామెంటెటర్‌గా సేవలు అందిస్తున్నాడు.
భారత జట్టులో కీలక ఆటగాడిగా దాదాపు దశాబ్ద కాలం కొనసాగిన సురేష్ రైనా ఐపీఎల్ 2020కు ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలికన కొంత సమయానికే రైనా సైతం కీలక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అయితే దేశవాలీలో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. Also Read: Pakistan vs New Zealand: స్టేడియంలోకి నగ్నంగా దూసుకొచ్చిన అభిమాని.. Viral Video
ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ అందుకున్న తొలి స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా. భారత్ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. చివరగా 2013లో టెస్ట్ మ్యాచ్ ఆడిన ఓజా 2020 ఫిబ్రవరిలో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
సచిన్ తర్వాత అతిపిన్న వయసులో భారత జట్టులోకి చోటు దక్కించుకున్న ఆటగాడు పార్థీవ్ పటేల్. ఈ డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. 2016-17 సీజన్లో కెప్టెన్‌గా గుజరాత్‌కు తొలిసారి రంజీ ట్రోఫీ అందించాడు. Also Read: Ravichandran Ashwin: ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా బౌలర్