Reliance Jio: రిలయన్స్‌ జియో కస్టమర్లకు దీపావళి బొనాంజా.. 100 GB క్లౌడ్ స్టోరేజీ ఉచితం..!

Jio AI Cloud Welcome Offer: రిలయన్స్‌ జియో తమ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. 100  జీబీ వరకు క్లౌడ్‌ స్టోరేజీని అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఫోటోస్, వీడిఇయోలు లేదా డాక్యుమెంట్లను స్టోర్‌ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

అదేవిధంగా రిలయన్స్‌ జియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందని గురువారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్‌హోల్డర్లను ఉద్దేశించి కంపెనీ చైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఈ సమాచారాన్ని అందించారు.  

2 /5

Jio పూర్తి AI కలిగి ఉన్న టూల్స్ ,ప్లాట్‌ఫారమ్‌ల సమగ్ర సూట్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనిని 'జియో బ్రెయిన్' అంటారు.రిలయన్స్ జియో  శక్తివంతమైన AI సేవల ప్లాట్‌ఫారమ్‌ను సృష్టిస్తామని నేను నమ్ముతున్నాను అని ఆయన చెప్పారు.  

3 /5

ప్రపంచంలోనే అత్యంత సరసమైన AI ఇంటర్‌ఫేసింగ్‌ను భారతదేశంలో సృష్టించడం మా లక్ష్యం అన్నారు. అంతేకాదు జామ్‌నగర్‌లో గిగావాట్-స్కేల్ AI-రెడీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని రిలయన్స్‌ జియో సన్నహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిగా రిలయన్స్ గ్రీన్ ఎనర్జీతో పనిచేస్తుంది.   

4 /5

AI ప్రతిచోటా, ప్రతిఒక్కరికీ అనే థీమ్‌పై కంపెనీ దీన్ని ప్రారంభించనుంది. మేము శక్తివంతమైన AI సేవల ప్లాట్‌ఫారమ్‌ను సృష్టిస్తామని నేను నమ్ముతున్నాను అని అంబానీ చెప్పారు. అనేక కొత్త AI సేవలను జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ ప్రకటించారు. ఇందులో Jio TVOS, HelloJio, Jio Home IoT సొల్యూషన్, Jio Home అప్లికేషన్, Jio Phonecall AI ఉన్నాయి.  

5 /5

100 GB ఉచిత క్లౌడ్ స్టోరేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ Jio AI క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రకటించారు. దీపావళి నుండి అందుబాటులో ఉంటుంది. కస్టమర్‌లు ఫోటోలు, వీడియోలు, పత్రాలు, డిజిటల్ కంటెంట్, డేటాను చాలా సురక్షితంగా నిల్వ చేయవచ్చు.