PM Modi: ప్రధాని మోదీతో మై హోమ్ గ్రూప్ అధినేత భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ

PM Modi-Jupally Rameshwar Rao Meeting: ప్రధాని మోదీని మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు కలిశారు. తన కుమారుడు, సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ జూపల్లి రామురావుతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి శాలువా కప్పి సత్కరించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధాని మోదీకి బహుమతిగా అందజేశారు.
 

1 /5

దేశరాజధాని ఢిల్లీలోని ప్రధాని నివాసంలో రామేశ్వరావు, రామురావు ప్రధానితో భేటీ అయ్యారు. రాము రావును నరేంద్ర మోదీ అప్యాయంగా హత్తుకుని పలకరించడం విశేషం.  

2 /5

అనంతరం దాదాపు గంటపాటు వీరు సమావేశం అయ్యారు. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.  

3 /5

అయితే ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక అంశాలపై ప్రధానితో చర్చించినట్లు తెలుస్తోంది.  

4 /5

ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక నేతగా గుర్తింపు ఉంది. ఆయన ఎక్కడికి వెళ్లినా.. అక్కడి ఆలయాలను దర్శించుకుంటారు.  

5 /5

ప్రధానిగా దేశంలో సమానత్వం నెలకొల్పేందుకు నరేంద్ర మోదీ చేస్తున్న కృషి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2022లో హైదరాబాద్ మహానగరంలో‌ ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని ప్రధాని ప్రారంభించిన విషయం తెలిసిందే.