Naga Chaitanya Recent movies Pre Release Business: ‘తండేల్’ సహా నాగ చైతన్య రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

Naga Chaitanya Recent movies Pre Release Business: అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పటికీ స్టార్ హీరో లీగ్ లోకి చేరలేదు. అయినా.. సినిమా సినిమాకు తన బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ‘తండేల్’ మూవీ కూడా అక్కినేని హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచిపోయింది.

 

1 /7

నాగ  చైతన్య హీరోగా నటించిన ‘తండేల్’ మూవీ చైతూ కెరీర్ లోనే హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా నిలిచింది. మొత్తంగా చైతూ మల్టీస్టారర్ గా నటించిన వెంకీ మామ, బంగార్రాజు సినిమాలను పక్కనపెడితే.. సోలో హీరోగా నటించిన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

2 /7

తండేల్.. నాగ చైతన్య, చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్ఫణలో బన్ని వాసు నిర్మాత తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

3 /7

కస్టడీ.. నాగ చైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 24.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

4 /7

థాంక్యూ.. నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థాంక్యూ’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

5 /7

లవ్ స్టోరీ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి కథానాయికగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

6 /7

మజిలి.. నాగ చైతన్య, ఒకప్పటి అతని నిజ జీవిత భాగస్వామి సమంత హీరో, హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజిలి’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

7 /7

సవ్యసాచి.. నాగ చైతన్య, చందూ మొండేటి కలయికలో వచ్చిన రెండో చిత్రం ‘సవ్యసాచి’. ఈ సినిమా అప్పట్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.