Naga Chaitanya-Shobhita engagement : నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం: శోభిత ధరించిన చీర ఎవరు డిజైన్ చేశారో తెలుసా?

Shobhita Saree : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థం చాలా కొద్దిమంది సమక్షంలో జరిగింది. చైతూ..శోభిత ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో శోభితా చాలా సింపుల్ ట్రెండీగా ఉన్న చీరను ధరించింది. శోభితా రెడీ అయిన విధానం, చీర, నగలు, వీటికి సంబంధించి ఎన్నో విషయాల్లో నెట్టింట్ట వైరల్ అయ్యాయి. 
 
1 /6

2 /6

శోభితా ధూళిపాళ్ల..అచ్చతెలుగు అమ్మాయి. ఈవిడ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అన్నింటిలోనూ తన సత్తా ఏంటో నిరూపించింది. అందం, అభినయంతోపాటు హాట్ లుక్స్ తోనూ అదరగొడుతుంది.   

3 /6

తాజాగా ఆమె అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లేందుకు నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రముఖ హీరో నాగచైతన్యతో గురువారం శోభిత ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. అయితే వీరిద్దరూ గత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నట్లు ఎన్నో వార్తలు షికారు చేశాయి. కానీ ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించలేదు. తర్వాత కాలంలో అంతగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా వీరిద్దరి నిశ్చితార్థం ఫొటోలను నాగార్జున షేర్ చేయడంతో అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.   

4 /6

కాగా నిశ్చితార్థంలో శోభితా సింపుల్ లుక్ తో అందర్నీ ఆకట్టుకుంది. చాలా సింపుల్ గా పద్దతిగా రెడీ అయ్యింది. కంకబరం కలర్ లో ఉన్న చీర, మెడలో నగలు, చేతులకు గాజులు, ఇలా అన్ని విషయాలపై నెట్టింట్లో ఒక్కటే చర్చ జరుగుతోంది.   

5 /6

శోభితా  నిశ్చితార్థంలో కంకబరం కలర్  కాంజివరం చీర కట్టుకుంది. మ్యాచింగ్ బ్లౌజ్ చాలా సింపుల్  వర్క్ తో డిజైన్ చేశారు. మెడలో హారం మరింత అందాన్ని ఇచ్చింది. తలలో కంకబరాలు, పొడవాటి బొట్టులో తెలుగుదనం ఉట్టిపడింది.   

6 /6

చెవులకు బుట్టాలు..శోభిత ముఖానికి మరింత అందాన్నిచ్చాయి. అయితే ఈ చీర ధర 2.30 నుంచి 3 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. నిశ్చితార్థం ఉంగరం ధర రూ. 5లక్షలు అని సమాచారం. అయితే ఈ చీరను ప్రత్యేకంగా చేనేత కార్మికులతో తయారు చేయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి నాగచైతన్య, శోభితా ధూళ్లిపాళ్ల కొత్త జీవితం షురూ చేస్తున్నారు.