Neha Dhupia Husband: బాలీవుడ్ లో ప్రముఖ నటి నేహా దూపియా 2018లో.. అంగత్ బేడి ని పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ జంటకి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో.. మాట్లాడుతూ తన వైవాహిక జీవితం గురించి.. తన భర్త గురించి.. నేహా ధూపియా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన భర్త..గర్ల్ ఫ్రెండ్స్ విషయాలు కూడా బయటపెట్టేసింది ఈ భామ.
బాలీవుడ్ లో మంచి పేరు ఉన్న నటీమణుల్లో నేహా దూపియా కూడా ఒకరు. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే నేహా ధూపియా తెలుగులో.. నిన్నే ఇష్టపడ్డాను అనే సినిమాలో కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఖయామత్ అనే సినిమాతో.. బాలీవుడ్ లో అడుగుపెట్టిన నేహా ధూపియా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కడక్కడ ఒకటి రెండు తెలుగు సినిమాల్లో కనిపించిన.. నేహా దూపియా బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.
ఒకప్పటి ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ బిషన్ సింగ్ బేడి.. తనయుడు అంగద్ బేడీని ప్రేమించి 2018 లో పెళ్లి చేసుకుంది నేహా. మొదట్లో అంగత్ వేడి అండర్ 19 క్రికెట్ టీం లో ఆడేవారు. రాంజీ మ్యాచెస్ లో కూడా పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత యాక్టింగ్ మోడలింగ్ తో బిజీ అయిపోయారు. పెళ్లయిన ఆరు నెలలు… పూర్తి అవగానే ఒక పండంటి ఆడబిడ్డకు జన్మ ఇచ్చింది నేహా ధూపియా.
అంటే నేహా ధూపి ఆ పెళ్లికి ముందే గర్భవతి అన్నమాట. ఈ విషయం గురించి ఆమె బయట.. పెద్దగా ప్రస్తావించలేదు కానీ.. మేలో పెళ్లి చేసుకున్న ఈ జంట నవంబర్లోనే తల్లిదండ్రులు అవడంతో అందరికీ ఈ విషయం అర్థం అయిపోయింది. పాప పుట్టిన తర్వాత నటిగా ఉండి..బరువు విషయంలో జాగ్రత్తలు పాటించడం లేదు అంటూ కొద్ది రోజులపాటు ఈమె మీద ట్రోలింగ్ కూడా జరిగింది.
2021లో నేహా ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా కపిల్ శర్మ షోకి వచ్చిన నేహా ధూపియా తన భర్త గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. తన భర్తకి పెళ్లికాకముందు 75 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారట. ఎంత పెళ్లికి ముందు అయినప్పటికీ.. 75 మంది గర్ల్ ఫ్రెండ్స్ అంటూ వ్యక్తిగత విషయాలను అంత సులువుగా బయటపెట్టేసి నేహా అందరికీ షాక్ ఇచ్చింది.
మరికొందరేమో ఒకళ్ళు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 75 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి అని అంటూ షాక్ అవుతున్నారు. ఇక కెరియర్ పరంగా చూస్తే.. నేహా ధూపియా ఈమధ్యనే విక్కీ కౌశల్, తృప్తి దిమ్రి హీరో హీరోయిన్లుగా నటించిన బ్యాడ్ న్యూస్ అనే సినిమాలో కనిపించింది.