Neha Shetty: చీరకట్టులో మరింత అందంగా టిల్లు భామ నేహా శెట్టి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Neha Shetty : డీజే టిల్లు మూవీతో నేహా శెట్టి పేరు మారు మోగిపోయింది.ఈ సినిమాతో ఈమెకు ఫేమ్ వచ్చిన అందుకు తగ్గట్టు అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. ఆ మధ్య ‘బెదురులంక’ సినిమాతో పలకరించింది. రీసెంట్‌గా  టిల్లు స్వ్కేర్ మూవీలో కాసేపు అలా మెరిసింది  రాధిక . అవకాశాలు ఉన్నా.. లేకపోయినా.. ఏదో ఒక ఫోటో షూట్‌లతో వార్తల్లో నిలవడం నేహా శెట్టి స్పెషాలిటీ.

1 /6

కన్నడ భామ అయిన నేహా శెట్టి.. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో పరిచయమైంది.

2 /6

నేహా శెట్టి తన మాతృ భాష కన్నడలో విడుదలైన 'ముంగారు మేల్ 2' మూవీతో  వెండితెర తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించి ఈ అమ్మడికి మంచి పేరు తీసుకొచ్చింది.  

3 /6

ఆ తర్వాత కన్నడలో 'గల్లీ రౌడీ' సినిమాతో పలకరించింది నేహా. అటు అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్నపాత్రలో మెరిసింది ఈ భామ. 

4 /6

ఇక డిజే టిల్లు వరకు నేహా గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఈ సినిమా విజయం తర్వాత నేహా శెట్టికి  వరుస ఆఫర్స్ వచ్చినా.. ఆమె ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. అంతేకాదు వీలైనపుడల్లా.. తన అంద చందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

5 /6

ఇక సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీలో నటించింది. తాజాగా మరోసారి 'టిల్లు స్క్వేర్' మూవీతో ప్రేక్షకులను కాసేపు అలా పలకరించింది వెళ్లింది.

6 /6

ప్రస్తుతం నేహా శెట్టి ఈమె విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోన్న 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీలో నటిస్తోంది. ఈ సినిమాపై ఈ అమ్మడు మంచి హోప్స్ పెట్టుకుంది.