November 2024 Bank holidays: అక్టోబర్ చివరికి వచ్చేశాం. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. అయితే, నవంబర్ నెలలో బ్యాంకులు కేవలం 12 రోజులే పనిచేయనున్నాయి. ఎందుకో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నవంబర్ 1వ తేదీ ఉత్తరాదిలో దీపావళి పండుగ హాలిడే ఉండనుంది. అక్కడి నుంచి మొదలుకొని నవంబర్ నెలలో బ్యాంకులు కేవలం 12 రోజులు మాత్రమే పనిచేయనున్నాయి.
నవంబర్ 2 బలిపాడ్యమి సందర్భంగా ఆరోజు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. నవంబర్ 3 ఆదివారం, 7, 8వ తేదీల్లో ఛత్ పూజ నిర్వహిస్తారు. అందుకే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో బంద్ ఉండనున్నాయి.
ఇక నవంబర్ 9, 10 వరుసగా రెండో శనివారం, ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు ఉంటాయి. 12 ఈగస్, 15 గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులు బంద్ ఉంటాయి.
అలాగే నవంబర్ 17 ఆదివారం, 18 కనకదశ జయంతి, 23, 24 తేదీలు మళ్లీ వరుసగా నాలుగో శనివారం, ఆదివారం కాబట్టి ఈరోజుల్లో కూడా బ్యాంకులకు సెలవు రానుంది. ఆర్‌బీఐ ప్రకారం ఇవి స్థానిక పండుగలపై ఆధారపడి సెలవులు ఉంటాయి.
కానీ, ఆన్‌లైన్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. మీ ఇంట్లో నుంచి కూడా ఈ ఆన్‌లైన్ బ్యాంకు సేవలు పొందవచ్చు. డబ్బుల లావాదేవీలు చేపట్టవచ్చు. బ్యాంకు సెలవు రోజుల్లో కూడా ఈ సేవలు పొందవచ్చు.