ఇరుగు పొరుగు దేశాలైన ఇండియా, పాకిస్తాన్లలో క్రికెట్ అంటే చాలా మక్కువ. చాలామంది పాకిస్తానీ క్రికెటర్లు భారతీయ మహిళల్ని పెళ్లి చేసుకున్నారు. భారతీయ మహిళల్ని పెళ్లి చేసుకున్న ఆ పాకిస్తానీ క్రికెటర్లు, భారతీయ భార్యల గురించి తెలుసుకుందాం.
Pakistani Cricketers: ఇరుగు పొరుగు దేశాలైన ఇండియా, పాకిస్తాన్లలో క్రికెట్ అంటే చాలా మక్కువ. చాలామంది పాకిస్తానీ క్రికెటర్లు భారతీయ మహిళల్ని పెళ్లి చేసుకున్నారు. భారతీయ మహిళల్ని పెళ్లి చేసుకున్న ఆ పాకిస్తానీ క్రికెటర్లు, భారతీయ భార్యల గురించి తెలుసుకుందాం.
Mohsin khan and Rina Roy మోహ్సిన్ ఖాన్ 80వ దశకంలో రీనా రాయ్‌ను వివాహమాడి ముంబైలోనే ఉండిపోయాడు. ఇద్దరికీ ఓ కుమార్తె ఉంది. పేరు జన్నత్. అయితే ఈ ఇద్దరి వివాహం ఎక్కువకాలం కొనసాగలేదు. 1990 ప్రారంభంలోనే విడాకులైపోయాయి.
Zaheer Abbas and Rita Luthra జహీర్ అబ్బాస్ 1988లో రీతా లూత్రాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం రీతా లూత్రా మతం మార్చుకుని..సమీనా అబ్బాస్‌గా మారింది. ప్రస్తుతం ఇద్దరూ కరాచీలో ఉంటున్నారు. సమీరా ఇంటీరియర్ బిజినెస్ నడుపుతోంది.
Hasan Ali and Shamiya Aarzoo పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ 2019 ఆగస్టు 20న హర్యానాకు చెందిన షామియా ఆర్జూని వివాహమాడాడు. భారతీయ ఏరోనాటికల్ ఇంజనీర్ షామియా ఆర్జూ వివాహం హసన్ అలీతో దుబాయ్‌లో జరిగింది. ఇందులో దాదాపు అందరూ బంధుమిత్రులే పాల్గొన్నారు.
Shaoib Malik and Sania Mirza భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా 2010 ఏప్రిల్ నెలలో పాకిస్తానీ ఆల్‌రౌండర్ షోయబ్ మలిక్‌ను వివాహమాడింది. ఇప్పుడీ ఇద్దరికీ రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. తమ తమ క్రీడారంగాల్లో ప్రావీణ్యులు ఈ ఇద్దరూ.