PM Kisan Beneficiary List: రైతుల ఖాతాల్లోకి రూ.2000, మీరు లబ్దిదారులేనా, జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి

How To Check PM Kisan Beneficiary List | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నదాతలకు చేయూత అందించేందుకు ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన (PM Kisan Scheme). డిసెంబర్ 1, 2018న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి ఏడాది మూడు దఫాలుగా రైతులకు మొత్తం రూ.6 వేల ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. 

1 /5

How To Check PM Kisan Beneficiary List | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నదాతలకు చేయూత అందించేందుకు ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన (PM Kisan Scheme). డిసెంబర్ 1, 2018న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి ఏడాది మూడు దఫాలుగా రైతులకు మొత్తం రూ.6 వేల ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం.  Also Read: PM Kisan Samman Nidhi Status: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ, PM Kisan స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

2 /5

PM Kisan Status : పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకంలో భాగంగా ఈ ఏడాది తొలి విడత నగదును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. మే 14వ తేదీన ఉదయం 11 గంటలకు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలలో రూ.2000 చొప్పున జమ చేయడానికి మొత్తం రూ.19000 కోట్లు విడుదల చేయడం తెలిసిందే. మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు రైతుల ఖాతాలకు రూ.2 వేలు జమ చేయనున్నారు. ఓవరాల్‌గా ఇది 8వ విడత.  Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు భారీగా పెరగనున్న వేతనాలు, త్వరలోనే 3 DA, ఇతరత్రా అలవెన్సులు

3 /5

How To Check PM Kisan Beneficiary List: పీఎం కిసాన్ లబ్దిదారుల జాబితా చెక్ చేసుకునే విధానం.. 1) రైతులు మొదటగా http://pmkisan.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలి.   2) పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో Farmer Cornerకు వెళ్లాలి.   3) అందులో Beneficiary List మీద క్లిక్ చేయండి 4)  మీరు రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్ మరియు గ్రామం వివరాలు నమోదు చేయండి. అనంతరం Get report మీద క్లిక్ చేస్తే పీఎం కిసాన్ లబ్దిదారుల జాబితా మీకు కనిపిస్తుంది.

4 /5

How To Check PM Kisan Samman Nidhi Status | పీఎం కిసాన్ నిధి జమ వివరాలు రైతులు ఇలా తెలుసుకోవచ్చు.  1) పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులు http://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌ సందర్శించాలి   2) పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో Farmer Cornerకు వెళ్లాలి.   3) ఆ తర్వాత Beneficiary Status మీద క్లిక్ చేయండి. రైతులు తమ అప్లికేషన్ స్టేటస్ వివరాలు ధ్రువీకరించుకోవాలి. ఆ జాబితాలో రైతుల పేరు, రైతు బ్యాంకు ఖాతాకు జమ అయిన నగదు వివరాలు కనిపిస్తాయి. 4) Get Data ఆప్షన్ మీద క్లిక్ చేసి Farmers Cornerకి వెళ్లాలి. పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారి వివరాలు తెలుసుకునేందుకు అక్కడ Beneficiary List మీద క్లిక్ చేయండి. 5) మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్ మరియు గ్రామం వివరాలు నమోదు చేయాలి. అనంతరం Drop-Down Menuలో Get Report మీద క్లిక్ చేస్తే వివరాలు వస్తాయి.

5 /5

How To Check PM Kisan Transactions: పీఎం కిసాన్ పథకం లావాదేవిలు ఎలా చెక్ చేయాలో తెలుసా 1) పీఎం కిసాన్ అర్హులైన రైతులు http://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌ సందర్శించాలి   2) అందులోని మెను బార్‌లో Farmer's Corner ఆప్షన్ మీద క్లిక్ చేయండి 3) (a) మీకు ఆధార్ నెంబర్, (b) అకౌంట్ నెంబర్ (C) మొబైల్ నెంబర్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులోని ఏదైనా ఓ ఆప్షన్ ద్వారా నగదు బదిలీల వివరాలు తెలుసుకోవచ్చు. 4) ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ నమోదు చేసిన తరువాత మీరు Get Data ఆప్షన్ మీద క్లిక్ చేయండి 5) గెట్ డేటా ఆప్షన్ మీద క్లిక్ చేసిన అనంతరం PM Kisan Status వివరాలు, మీకు ఇప్పటివరకూ జరిగిన నగదు లావాదేవిల వివరాలు కనిపిస్తాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook