Pooja Hegde: మరోసారి తన పాత సెంటిమెంట్ ఫాలో కానున్న జిల్ జిల్ జిగేలు రాణి..!

Pooja Hegde Item Song : సౌత్ ఇండియాలోనే కాదు నార్త్ ఇండియాలో కూడా తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకుంది హీరోయిన్ పూజ హెగ్డే. ప్రస్తుతం అక్కడ, ఇక్కడ.. కొన్ని సినిమాలు చేస్తూ తన కెరియర్ కొనసాగిస్తుంది. అయితే ప్రస్తుతం వలస అపజయాలు చవిచూస్తున్న ఈ హీరోయిన్ మరోసారి ఐటమ్ సాంగ్ లో కనిపించనుంది అనే వార్త వినిపిస్తుంది. 

1 /5

ఒక లైలా కోసం, ముకుందా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ పూజ హెగ్డే. కానీ ఈ రెండు సినిమాల కన్నా కూడా పూజ హెగ్డే ఐటమ్ సాంగ్ చేసిన సినిమా మరింత విజయం సాధించింది. అదే రంగస్థలం. 

2 /5

రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో.. జిల్ జిల్ జిగేలు రాణి సాంగ్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఈ సాంగ్ ఈ హీరోయిన్ కి ఎక్కువ పేరు తెచ్చి పెట్టింది. 

3 /5

అంతేకాదు ఈ సాంగ్ తర్వాత మళ్లీ వరస సినిమా ఛాన్సులు అందుకొని వరస విజయాలు కూడా అందుకుంది పూజ హెగ్డే. అలా వైకుంఠపురం, అరవింద సమేత లాంటి ఇండస్ట్రీ హిట్స్ అందుకుంది.   

4 /5

ఇక ఇప్పుడు మరోసారి ఈ హిట్ ఫార్ములానే ఫాలో అవ్వబోతోంది బుట్ట బొమ్మ. ప్రస్తుతం పూజ హెగ్డేని వలస ప్లాపులు చుట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మరోసారి రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో పూజ హెగ్డే ఐటమ్ సాంగ్ చెయ్యనుంది అని వినిపిస్తోంది.   

5 /5

రంగస్థలం ఐటమ్ సాంగ్ తర్వాత.. ఎలాగైతే ఈ హీరోయిన్ కి వరస హిట్లు వచ్చాయో.. ఇప్పుడు మళ్లీ ఈ ఐటమ్ సాంగ్ తర్వాత అలానే హిట్లు రావచ్చని అభిమానులు సెంటిమెంట్ వ్యక్తం చేస్తున్నారు. కాగా రజనీకాంత్ సినిమాలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.