Pv sindhu marriage photos viral: బ్యాడ్మింటన్ క్రీడాకరిణి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పీవీ సింధూ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ సెలబ్రేషన్స్ లో ఉన్నారంట.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త జీవితంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తొంది. ఆమె పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని ఇటీవల పెళ్లి చేసుకున్నారు. వీరి వెడ్డింగ్.. ఆమె వివాహం ఆదివారం జరిగింది.
రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో రఫల్స్ హోటల్ వేదికగా ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది. దగ్గరి బంధువులు,స్నేహితులు ఈ వేడుకకు హజరైనట్లు తెలుస్తొంది.
తాజాగా వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోస్ లను.. సింధు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఇవి ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.
పీవీ సింధు పెళ్లి సంప్రదాయ బద్దంగా జరిగినట్లు తెలుస్తొంది. ఇటీవల అనేక మంది ప్రముఖలు తమ పెళ్లిని రాజస్థాన్లో చేసుకుంటున్నట్లు సమాచారం. ఉదయ్ పూర్ లో గతంలోను అనేక మంది సెలబ్రీటీల పెళ్లిళ్లు జరిగిన విషయం తెలిసిందే.