Rahu Gochar 2025: నవ గ్రహాల్లో రాహు, కేతువులు అపసవ్య (రివర్స్)లో తిరుగుతూ ఉంటాయి. నవగ్రహాల్లో వీటిని ఛాయా గ్రహాలుగా అభివర్ణిస్తుంటారు. రాహువు వచ్చే నెల హోళి తర్వాత మీనం నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి శుభం జరిగే అవకాశాలున్నాయి. రాహు సంచారము వలన ఏ రాశులకు ప్రయోజనం కలగనుందో మీరు ఓ లుక్కేయండి..
Rahu Gochar 2025: జ్యోతిష శాస్త్రంలో రాహువు ఒక అస్పష్టమైన గ్రహంగా పరిగణించబడుతుంది. రాహువు ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు. హోలీ పండగ తర్వాత.. రాహువు కుంభ రాశిలో సంచరిస్తున్నారు. రాహువు, కేతువు ఎల్లప్పుడూ తిరోగమనంలో సంచరిస్తూ ఉంటారు. రాహు సంచార ప్రభావం మేషం నుండి మీన రాశి వరకు ప్రభావం చూపిస్తోంది.
జ్యోతిష్య శాస్త్ర గణనల ప్రకారం, కొన్ని రాశుల వారికి రాహు సంచారము చాలా శుభప్రదంగా ఉండబోతోంది. కుంభ రాశిలో రాహువు సంచారం ఆదివారం, మే 18, 2025 నాడు జరుగనుంది. రాహువు ఈ రాశిలో డిసెంబర్ 5, 2026 వరకు ఉండనున్నారు. రాహువు శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించిండం వలన ఏ రాశుల వారికి మంచి రోజులు వస్తాయో తెలుసుకోండి.
వృషభ రాశి : రాహు సంచారము వృషభ రాశి వారికి అనుకూలమైన సమయం. ఈ సమయంలో వీరిని అదృష్టం వెంటాడుతుంది. అంతేకాదు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. పనిచేసే కార్యాలయంలో గొప్ప విజయాన్ని అందుకుంటారు. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ రాశుల వారు ఆర్థికంగా శారీరకంగా ధృడంగా ఉంటారు.
సింహ రాశి : కుంభ రాశిలో రాహువు సంచారం సింహ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. ఇది వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించి అత్యంత అనుకూలమైన సమయం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ముగియవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతోంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కోరిన కోరికలు తీరుతాయి. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది.
ధనుస్సు రాశి: రాహు శనిదేవుడికి సంబంధించిన కుంభంలో సంచారము వలన ధనుస్సు రాశి వారిపై శుభ ప్రభావాన్ని చూపుతుంది. డబ్బు సంబంధిత సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే మంచి సమయం. ఆర్థికంగా సుసంపన్నంగా ఉంటారు. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. జీవితంలో ఆనందం వెతుక్కుంటూ వస్తుంది. వ్యాపారంలో పెరుగుదల అవకాశాలు ఉన్నాయి.
మీన రాశి : రాహు కుంభ రాశి సంచారము వలన మీన రాశి వారిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. కుంభ రాశిలో రాహువు సంచారము వలన, మీన రాశి వారికి ఆకస్మిక ధన లాభం ఉండే అవకాశాలున్నాయి. ఉద్యోగంలో మంచి రోజులు ఏర్పడుతాయి. జీవితంలో అవసరాన్ని బట్టి వస్తువులు సమకూరుతాయి. అయితే, పెట్టుబడుల విషయంలో అప్రమత్తత అవసరం. వ్యాపార పరిస్థితులు వేగంగా మెరుగుపడతాయి.
గమనిక: ఈ కథనం మతపరమైన, జ్యోతిష్యులు, పండితులు, నెట్ లో ఇచ్చిన సమాచారాన్ని మా ప్రేక్షక దేవుళ్లకు అందించాము. జీ న్యూస్ ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు.