Rahu -Shukra Transit: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి మంచి యోగం ఏర్పడుతుంది. అలాంటి అరుదైన కలయికల గ్రహ మండలంలో రాహు, శుక్రులు 18 ఏళ్ల తర్వాత కలవబోతున్నారు. దీంతో కొన్ని రాశుల వారి జీవితంలో అనుకోని సంపదతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, పెళ్లి కానీ ఆడ, మగ ఈ యేడాదే పెళ్లి పీఠలు ఎక్కడం గ్యారంటీ అని చెబుతున్నారు.
Rahu -Shukra Transit: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని విలాసవంతమైన గ్రహం. అంతేకాదు నటీనటులు గ్లామర్ ఫీల్డ్ సహా పేజ్ త్రీ కల్చర్ కు సంబంధించిన ప్రతి ఒక్కరికి శుక్ర గ్రహంతో అనుబంధం ఉంటుంది. ఇక నవగ్రహాల్లో రాహువుతో పాటు కేతువు ఛాయా గ్రహాలుగా పరిగణిస్తారు. అంతేకాదు నవ గ్రహాల్లో పాప గ్రహంగా పిలుస్తారు.
వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం.. రాహువు తిరోగమనం చెందుతూ ఉంటుంది. అలా రాహువు ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి తిరోగమనంలో వెళుతుంది. మొత్తంగా రాహువు 27 ఒక రాశి నుంచి మరొక రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 18 నెలలు సమయం పడుతోంది.
రాహువు ప్రస్తుతం ఉత్తరాబాద్ర నక్షత్రంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఫిబ్రవరి 1న శుక్రుడు ఈ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీంతో 18 యేళ్ల తర్వాత ఉత్తరాబాద్ర నక్షత్రంలో మీన రాశిలో రాహువు, శుక్ర కలయిక ఏర్పడుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికీ అనుకోని అదృష్టం వరించబోతుంది.
మేష రాశి.. ఉత్తరాబాద్ర నక్షత్రంలో మీన రాశిలో రాహువు, శుక్రుడు కలయిక వల్ల మేష రాశి వారికి అనుకోని ధనయోగం ఏర్పడబోతుంది. ఈ రాశిపై శని భగవానుని ప్రత్యేక ఆశీస్సులు వల్ల పూర్వీకుల ఆస్తులు కలిసొస్తాయి. పెళ్లి కానీ ఆడవాళ్లతో పాటు మగవాళ్లకు వివాహా యోగం ప్రాప్తం ఉండనుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు.
మకర రాశి: మీన రాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు, శుక్రుల కలయిక వల్ల మీ శ్రమకు తగ్గ ఫలితం అందుకుంటారు. కొన్నేళ్లుగా వివాహాం కానీ స్త్రీ, పురుషులకు ఈ యేడాది ప్రథమార్ధంలో వివాహా యోగం సిద్ధించనుంది. ఇంట్లో, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఉండనుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. పెట్టుబడుల మూలంగా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరనుంది.
వృషభ రాశి .. వృషభ రాశి వారికి రాహు, శుక్రుల కలయిక వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు అందుకుంటారు. పెళ్లి కానీ వారికీ ఇది యోగకాలం. ఉద్యోగస్థులకు పై వాళ్ల ఆశీస్సులు లభిస్తాయి. కోర్టు కేసుల్లో విజయం వరిస్తుంది. ఆదాయం భారీగా సమకూరనుంది. ఆర్ధికంగా ఎంతో ఉన్నతిని సాధిస్తారు. భవిష్యత్తు బంగారు మయంగా ఉండనుంది.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, పండితులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, అంతర్జాలంలోని జ్యోతిష్య సమాచారం ఆధారంగా ఇచ్చినది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.