Rakshabandhan Gift Ideas: రాఖీ వచ్చేస్తోంది, మీ సోదరికి ఏ గిఫ్ట్ ఇవ్వాలో తెలియడం లేదా, 5 బెస్ట్ గిఫ్ట్ ఐడియాలు

Rakshabandhan Gift Ideas: రాఖీ పండుగ వచ్చేస్తోంది. సోదర సోదరీమణుల ప్రేమకు చిహ్నంగా భావించే రక్షాబంధన్ ఆగస్టు 30న ఉంది. ప్రేమతో రాఖీ కట్టే సోదరికి అంతకంటే ప్రేమతో ఏదైనా బహుమతి ఇవ్వడం ఓ ఆనవాయితీ. మరి మీ సోదరికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో తెలియక తికమక పడుతుంటే..మీ కోసం కొన్ని గిఫ్ట్ ఐడియాలు..

Rakshabandhan Gift Ideas: రక్షాబంధన్ రోజున సోదరుడి నుదుట తిలకం దిద్ది..చేతికి రాఖీ కడుతుంది సోదరి. అందుకు ప్రతిగా ఆమెకు రక్షణగా ఉంటానని మాటిస్తాడు. చిన్నదో పెద్దదో ప్రేమగా ఓ బహుమతి లేదా నగదు చేతికిస్తాడు. మరి మీ సోదరికి ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో చూద్దాం..

1 /5

స్మార్ట్ వాచ్ ఇటీవలి కాలంలో స్మార్ట్ వాచ్ ఉపయోగం ఎక్కువగా కన్పిస్తోంది. అందుకే రాఖీ నాడు మీ సోదరికి మంచి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ ఇస్తే బాగుంటుంది. కచ్చితంగా మీ సోదరికి నచ్చే బహుమతి ఇది.

2 /5

మేకప్ కిట్ ఇక అమ్మాయిలు అమితంగా ఇష్టపడే మరో బహుమతి మేకప్ కిట్. ఈ బహుమతి ఇష్టపడని అమ్మాయిలుండరు. అందుకే మంచి బ్రాండెడ్ మేకప్ కిట్ రాఖీ నాడు బహుమతిగా ఇస్తే బాగుంటుంది. 

3 /5

జ్యువెల్లరీ అమ్మాయిలకు నగలు ధరించడం అంటే చాలా చాలా ఇష్టం. నగలు బహుమతిగా ఇస్తే మీ సోదరి చాలా ఇష్టపడుతుంది. గోల్డ్ లేదా డైమండ్ సెట్ కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. 

4 /5

డ్రెస్ బహుమతి మీ సోదరి మీ కంటే పెద్దదైనప్పుడు ప్రేమగా మంచి సల్వార్ సూట్ లేదా చీర బహుమతిగా ఇవ్వవచ్చు. పెళ్లైనవారికైతే ఈ బహుమతి మరింత నచ్చుతుంది. సోదరి మీ కంటే చినదైతే అందమైన డ్రెస్ కొనివ్వచ్చు.

5 /5

బ్రేస్ లెట్ రక్షాబంధన్ రోజున మీ సోదరికి అందమైన బ్రేస్ లెట్ బహుమతిగా ఇవ్వవచ్చు. ఎందుకంటే అమ్మాయిలు బ్రేస్ లెట్ చాలా ఇష్టపడతారు. ఇది ఆమె రోజూ ఉపయోగించే గిఫ్ట్ అవుతుంది.