Ram Charan at Oscars: పుట్టబోయే బిడ్డ అదృష్టంతో ఆస్కార్.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Ram Charan Comments at Oscars: ఆస్కార్ అవార్డులో వేడుకకు హాజరైన రామ్ చరణ్ తన భార్య ప్రస్తుతం ఆరోనెల గర్భవతిగా ఉందని తమకు పుట్టబోయే బిడ్డ తనకు అదృష్టం తీసుకొస్తుందని నమ్ముతున్నాం అంటూ కామెంట్లు చేశారు. 
 

  • Mar 13, 2023, 12:57 PM IST
1 /5

ఆస్కార్ అవార్డుల వేడుకకు రామ్ చరణ్ తేజ తన భార్య ఉపాసన కొణిదలతో కలిసి హాజరయ్యారు.   

2 /5

రెడ్ కార్పెట్ మీద తన బ్లాక్ డ్రెస్ తో అలరించిన రామ్ చరణ్ తేజ తర్వాత భార్య ఉపాసనతో కలిసి అక్కడి రెడ్ కార్పెట్ మీడియాతో మాట్లాడారు.   

3 /5

ఈ సందర్భంగా ఉపాసన తాను తన భర్తకు సపోర్టుగా ఇక్కడికి వచ్చానని ఆస్కార్ అవార్డు వస్తుందా లేదా అనే విషయం మీద కొంత టెన్షన్ ఉన్నా ఈ ఫీలింగ్ అద్భుతంగా ఉందని కామెంట్లు చేసింది.   

4 /5

అయితే రామ్ చరణ్ తేజ తన భార్య ఉపాసన గురించి మాట్లాడుతూ తాను ప్రస్తుతం ఆరు నెలల గర్భవతిగా ఉందని తనకు పుట్టబోయే బిడ్డ తనకు అదృష్టం తీసుకొస్తుందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.  

5 /5

 ఆసక్తికరంగా రామ్ చరణ్ మాట్లాడిన విధంగానే ఆస్కార్ అవార్డు ఆర్ఆర్ఆర్ యూనిట్ని వరించడంతో రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డ అదృష్టమే ఆస్కార్ అవార్డుని తీసుకువచ్చింది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ అంశం మీద మీ ఉద్దేశం ఏమిటో కూడా కింద కామెంట్ చేయండి.