Krack movie తర్వాత భారీగా Remuneration పెంచిన Raviteja

క్రాక్ మూవీ సక్సెస్ అవడంతో మాస్ మహారాజ రవితేజ తన పారితోషికాన్ని ( Raviteja remuneration ) భారీగానే పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు, రవితేజ 10 నుండి 12 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా అందుకుంటుండగా... తాజాగా రవితేజ దీన్ని రూ .14 కోట్లు ప్లస్ జీఎస్టీకి పెంచినట్టు సమాచారం.

  • Jan 27, 2021, 18:11 PM IST

క్రాక్ మూవీ సక్సెస్ అవడంతో మాస్ మహారాజ రవితేజ తన పారితోషికాన్ని ( Raviteja remuneration ) భారీగానే పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు, రవితేజ 10 నుండి 12 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా అందుకుంటుండగా... తాజాగా రవితేజ దీన్ని రూ .14 కోట్లు ప్లస్ జీఎస్టీకి పెంచినట్టు సమాచారం. అంటే పారితోషికంతో పాటు జీఎస్టీ కూడా కలిపి అంతా రూ .16 కోట్లకు దగ్గరగా వస్తుందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. 

1 /4

తన సినిమాలు రూ. 26 కోట్ల నుంచి రూ. 28 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నాయని.. అందుకే తనకు ఇచ్చే పారితోషికం పెంచాలని రవితేజ డిమాండ్ చేస్తున్నట్టు ఫిలింనగర్ టాక్.

2 /4

క్రాక్ సినిమా ( Krack movie ) విజయవంతం అయిన నేపథ్యంలో తన తర్వాతి చిత్రాలకు థియేట్రికల్ బిజినెస్ కూడా లాభదాయకంగానే ఉంటుందని రవితేజ చెప్పుకొస్తున్నాడట.

3 /4

రవితేజ చెబుతున్న వెర్షన్ ప్రకారం అతడి సినిమాలు రూ. 25 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేస్తుండగా... మరో రూ. 25 కోట్లు నాన్-థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నాయి. అంటే అంతా కలిపి తన సినిమాలపై రూ .50 కోట్ల వ్యాపారం జరుగుతున్నప్పుడు, తాను కోట్ చేస్తోన్న రెమ్యునరేషన్ ( Remuneration ) కూడా నిర్మాతలకు భారం కాబోదని... అందుకే తాను రెమ్యునరేషన్ పెంచానని మాస్ మహారాజ చెబుతున్నారట.

4 /4

అన్నింటికి మించి మాస్ మహారాజ Raviteja సినిమాలంటే మినిమం గ్యారెంటీ అనే పేరు కూడా ఎలాగూ ఉండనే ఉంది. మొత్తానికి గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో శృతిహాసన్‌తో ( Shruti Haasan ) జోడీ కట్టి చేసిన క్రాక్ మూవీ రవితేజకు మాంచి జోష్‌నే ఇచ్చిందన్న మాట.