School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 3 రోజులపాటు అన్నీ స్కూళ్లు, కాలేజీలకు సెలవు..!

School Holidays For 3 Days: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్నీ స్కూళ్లు, కాలేజీలకు వరుసగా సెలవులు రానున్నాయి.. వచ్చేవారం నుంచి మూడు రోజులపాటు సెలవులు అన్ని స్కూళ్లు, కాలేజీలకు వర్తిస్తాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

దేశవ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంతరంగా వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 7న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ 17న వినాయక నిమజ్జనం జరుపుతారు.  

2 /5

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి రోజు స్కూలు, కాలేజీలకు అన్ని బ్యాంకులకు కూడా సెలవు దినంగా ప్రకటించారు. గణేశా నిమజ్జనం కూడా సెలవు దినంగా పరిగణిస్తారు. ఈ నెలలో భారీ వర్షాలు, వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా రోజులు వరకు స్కూల్ హాలిడేస్ ని ప్రకటించారు ఇందులో పండుగలు కూడా ఉన్నాయి.  

3 /5

అయితే మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. రేపు రెండో శనివారం సాధారణంగా సెలవు దినం అయితే  కొన్ని జిల్లాల్లో కాంపెన్సేషన్ గా రెండవ శనివారం తేదీ 14-09-2024 ని వర్కింగ్ డే గా ప్రకటించారు.  ఆ ఉత్తర్వులు ఆయా జిల్లాలకు మాత్రమే పరిమితం అవుతాయి. ఎందుకంటే వరదల కారణంగా గతంలో సెలవులు ఇచ్చారు

4 /5

దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లు, కాలేజీలకు ఆదివారం 15వ తేదీ సాధారణంగా సెలవు, 16వ తేదీ సోమవారం మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ఆ రోజు సెలవు దినం, ఇక మంగళవారం 17వ తేదీ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా సర్క్యూలర్ జారీ చేసింది.  

5 /5

ఇలా మరోసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్లో కాలేజీలకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి ఈ సెప్టెంబర్ లో బ్యాంకులో కూడా కేవలం సగం రోజులే పనిచేస్తున్నాయి