Shriya Saran: మరోసారి మరింత అందంగా శ్రియ.. మట్టెక్కించే ఫోటోలు వైరల్..

Shriya Saran instagram pics: శ్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వయసు ఎంత పెరుగుతున్న.. తరగని అందం ఆమెది. ఇప్పటికి రెండు పదుల వయసులోనే.. కనిపించే శ్రియ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసే ఫోటోలు.. అభిమానులను తెగ ఆకట్టుకుంటూ ఉంటాయి.

1 /5

రామోజీరావు నిర్మాణంలో వచ్చిన ఇష్టం సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రియ. హిందీ ప్రేక్షకులకు కూడా రామోజీరావు నిర్మాణం వహించిన.. తుజే మేరీ కసం సినిమా ద్వారా పరిచయమైంది.

2 /5

అయితే శ్రియాకి హిందీలో రాని క్రేజ్.. తెలుగులో వచ్చింది. ఇష్టం తర్వాత వచ్చిన సంతోషం సినిమాతో.. ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ నాగార్జున సినిమా.. అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించి శ్రియాకి వరస అవకాశాలు తెచ్చిపెట్టింది. వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో.. నువ్వే నువ్వే సినిమాలో కనిపించింది

3 /5

నువ్వే నువ్వే సినిమా శ్రియకి నటిగా కూడా.. మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత చిరంజీవితో ఠాగూర్, బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి, వెంకటేష్ తో సుభాష్ చంద్రబోస్, మహేష్ బాబుతో అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తో నా అల్లుడు, పవన్ కళ్యాణ్ తో బాలు.. లాంటి సినిమాలలో కనిపించింది

4 /5

ఒకపక్క ఇలా స్టార్ హీరోలతో నటిస్తూ.. మరో పక్క చిన్న హీరోలతో సైతం సదా మీ సేవలో, ఎలా చెప్పను లాంటి సినిమాలు.. చేస్తూ వచ్చింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా రజినీకాంత్ లాంటి స్టార్ హీరోతో.. చేసిన శివాజీ సినిమా వల్ల స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

5 /5

శ్రియ నటించని భాష లేదు… హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించిన శ్రియ..ఈమధ్య తెలుగు కన్నా ఎక్కువ హిందీ సినిమాలలోనే కనిపించింది. అయితే శ్రియా మళ్లీ.. తెలుగు సినిమాలలో ఎప్పుడు కనిపిస్తుంది అని ఎదురుచూస్తున్నారు.. ఆమె అభిమానులు. ఈ క్రమంలో శ్రియా ఇంస్టాగ్రామ్ ఫోటోలు.. వైరల్ అవుతూ అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.