Skin Care Tips: చర్మ సంరక్షణ అన్నింటికంటే చాలా ముఖ్యం. అంతర్గత ఆరోగ్యంతో పాటు బాహ్య ఆరోగ్యం కూడా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. లేకపోతే వివిధ రకాల చర్మ సమస్యలు బాధిస్తుంటాయి. అయితే చర్మ సమస్యలకు టొమాటో మంచి పరిష్కారంగా కన్పిస్తుంది. చర్మం రంగు మెరుగుపడేందుకు టొమాటో అద్భుతంగా పనిచేస్తుంది.
టొమాటో సీరమ్ టొమాటోలో ఆల్ఫా హైడ్రాక్సీ ఆయిల్ నిండుగా ఉంటుంది. చర్మం పీహెచ్ లెవెల్‌ను బ్యాలెన్స్ చేస్తుంది.టొమాటో, యాపిల్ వెనిగర్ కలిపి రాయడం వల్ల చర్మం కళకళలాడుతుంది.
టొమాటో స్క్రాబ్ ఒక టొమాటో రసం, గుంజుకు పంచదార, నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. సాఫ్ట్ స్క్రబ్ సహాయంతో చర్మానికి అప్లై చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.
టొమాటో ఫేస్ ఆయిల్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండే టొమాటో..శరీరాన్ని లేదా చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ఫలితంగా ఏజీయింగ్ ప్రక్రియ అగుతుంది. టొమాటో రసాన్ని విటమిన్ ఇ ఆయిల్‌తో కలిపి ముఖానికి రాయడం వల్ల వృద్ధాప్య ప్రక్రియ మందగిస్తుంది.
టొమాటో ఫేస్ మాస్క్ టొమాటోలో నీరు పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్ కోసం టొమాటో రసాన్న్ని తేనె, అల్లోవెరాతో కలిపి రాయాలి.
టొమాటో ఐ ట్రీట్మెంట్ టొమాటోలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ముఖంపై ఏర్పడే నల్ల మచ్చల్ని తొలగిస్తుంది. టొమాటో రసాన్ని కంటి కింద రాసుకున 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల కళ్లు ప్రకాశవంతంగా ఉంటాయి.