Thandel Movie Release: తండేల్ మూవీ రిలీజ్ నేపథ్యంలో శోభిత ధూళిపాళ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మీ నిజస్వరూపం ఇప్పుడు బైటపడుతుందని సామీ అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
నాగచైతన్య, సాయి పల్లవి తండేల్ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది.ఈ మూవీ ప్రస్తుతం అదిరిపోయే టాక్ తో దూసుకుపోతుంది. అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ మూవీలో చైతు, సాయి పల్లవి ఇద్దరు కూడా అదిరిపోయే విధంగా నటించారని అభిమానులు చెప్తున్నారు.
తండేల్ మూవీ సక్సెస్ ను ప్రస్తుతం శోభిత కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శోభిత ధూళి పాళ తాజాగా.. తన భర్త తండేల్ మూవీలుక్ పై ఆసక్తి కర పోస్ట్ పెట్టారు. చాలా రోజుల నుంచి ఈ మూవీ కోసం చైతు గడ్డం, జుట్టు పెంచుకుని కన్పిస్తున్నారు.
ముఖ్యంగా ఈ మూవీ కోసం.. 2023 నుంచి చైతు ఈ విధంగానే గడ్డం, జుట్లు పెంచుకుంటున్నారు. కనీసం పెళ్లి సమయంలో కూడా గడ్డం తీసుకొకుండానే కన్పించారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యింది కాబట్టి తన భర్త అసలైన క్యూట్ రూపం ఇప్పుడు చూస్తానని శోభిత ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.
తండేల్ మూవీ ప్రస్తుతం అభిమానుల నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన కొంత మంది మత్య్సకారులు చేపలు పట్టడం భాగంగా పాక్ బార్డర్ లోకి ప్రవేశించారు. అప్పుడు వీళ్లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కథ ఆధారంగా తండేల్ మూవీని చందు మొండేటీ తెరకెక్కించారు. అయితే.. శోభిత ధూళిపాళ పెట్టిన పోస్టుపై నాగచైతన్య స్పందించారు. తన భార్య పెట్టిన పోస్టుకు థైంక్యూ బుజ్జితల్లి అని క్యూట్ గా రిప్లై ఇచ్చారు.
తండేల్ మూవీలో నాగచైతన్య తండేల్ రాజుగా, సాయిపల్లవి బుజ్జితల్లి పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ మూవీకి ఏపీలో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు చంద్రబాబు సర్కారు అనుమతి ఇచ్చింది. తెలంగాణలో మాత్రం మూవీ టీమ్ రేవంత్ సర్కారు టికెట్ల విషయంలో సంప్రదించలేదు.