Andaman Islands: అండమాన్ నికోబార్ దీవుల అందాలు చూస్తే మైమర్చిపోతారు. అండమాన్ అందం అటువంటిది. నీలాకాశం ప్రతిబింబిస్తూ..నీలి నీటి మేఘాల్లో అత్యద్భుతంగా కన్పించే దీవుల సమాహారం. అండమాన్‌లోని ఈ దీవుల్ని చూడకపోతే..మీ యాత్ర అసంపూర్తిగా మిగిలిపోతుంది. అండమాన్‌లోని ప్రముఖ దీవులు, వాటి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం..
రాస్ ఐల్యాండ్ పోర్ట్ బ్లయర్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఐల్యాండ్ చాలా విశిష్టమైనది. ఈ ఐల్యాండ్ భారత నావికాదళానికి చెందింది. ఇక్కడికొచ్చే పర్యాటకులు రిజిస్టర్లో ఎంట్రీ తప్పనిసరి.
ప్యారెట్ ఐల్యాండ్ పక్షులంటే ఇష్టపడేవారికి ఈ ప్రాంతం చాలా మంచి టూరిస్ట్ డెస్టినేషన్. ఇక్కడున్న మడ అడవుల్లో పెద్ద సంఖ్యలో రామచిలుకలు ఉన్నాయి.
నార్త్‌బే ఐల్యాండ్ అండమాన్‌లో స్నార్క్లింగ్ కోసం ఇది మంచి అనువైన ప్రాంతం. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలున్నాయి.
బరెన్ ఐల్యాండ్ భారత ఉపఖండంలోని ఏకైన అగ్నిపర్వతం ఇక్కడే ఉంది. ఈ ఐల్యాండ్‌లో జనాభా లేదు. ఈ ఐల్యాండ్ ఉత్తరభాగంలో అయితే చెట్లు కూడా లేవు.
బ్లూ ఐల్యాండ్ ఈ దీవి ఇండియాకు చెందిన కొన్ని ప్రత్యేక రత్నాల్లో ఒకటి. ఇదొక ప్రశాంతమైన దీవి. నిత్యం ఉరుకులు పరుగులతో ఉండే పోటీ ప్రపంచానికి దూరంగా ఉంటుంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతుంటాయి ఈ దీవిలో.
హ్యావ్లాక్ ఐల్యాండ్ ఇక్కడ స్కూబా డైవింగ్ ప్రసిద్ధి. ప్రకృతి ప్రేమికుడి నుంచి మొదలుకుని..సాహసాలు చేసేవారికి ఈ ఐల్యాండ్ స్వర్గధామమే.