Ileana: ఇలియానాకు స్టార్ డైరెక్టర్ అవమానం.. కట్ చేస్తే.. వైవిఎస్ సమాధానం ఇదే..!

Ileana Debut: ఇటీవల డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఆయనకే చెమటలు పట్టిస్తూ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు చాలా తెలివిగా సమాధానం చెప్పి  క్లారిటీ ఇచ్చారు. 

1 /5

సాధారణంగా ఒక సినిమా అనుకున్నప్పుడు దర్శకనిర్మాతలు ఆ పాత్రలలో ఎవరు సరిపోతారు అనే విషయాన్ని స్క్రీన్ టెస్ట్ చేసి మరీ తీసుకుంటారు. అయితే కొంతమంది హీరోయిన్లను చాలామంది డైరెక్టర్లు రిజెక్ట్ చేస్తూ ఉంటారు.  అయితే అదే హీరోయిన్లు ఇంకొంతమంది డైరెక్టర్లు చేతుల్లో పడితే,  ఆ డైరెక్టర్లు మాత్రం.. తాము అనుకున్న పాత్రకు వారు సెట్ అయితే కచ్చితంగా ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీస్ అయిపోతారు. 

2 /5

ఆ డైరెక్టర్ రిజెక్ట్ చేశారు కదా కానీ మీ డైరెక్షన్లో ఆమె స్టార్ హీరోయిన్ ఎలా అయ్యింది అనే విషయాన్ని చాలామంది వేలెత్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇలా ఆలోచించే వారికి,  డైరెక్టర్లపై విమర్శలు గుప్పించే వారికి సరైన సమాధానం చెప్పారు ప్రముఖ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. 

3 /5

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వైవిఎస్ చౌదరితో ఒక మీడియా మిత్రులు.. వందమందికి నచ్చిన హీరోయిన్ ని పెట్టుకుంటానన్నారు.. నచ్చని హీరోయిన్ ని రిజెక్ట్ చేస్తానని ఇందాక చెప్పారు. నాకు తెలిసి ఇలియానాను మొదట డైరెక్టర్ తేజ రిజెక్ట్ చేశారు కదా.. కానీ ఆమె మీ డైరెక్షన్లో సినిమా చేసేసరికి స్టార్ హీరోయిన్ అయిపోయింది దీనికి మీ సమాధానం ఏంటి? అని ప్రశ్నించారు.   

4 /5

ఇక డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. “మీ దగ్గర చాలా మేటర్ ఉంది. ఎంతో సమాచారం  సమకూర్చుకొని వచ్చారు అంటూ చమత్కరిస్తూనే.. నేనేం చేయలేను. ఎవరి దగ్గరైనా మేటర్ ఉంటే ఎవరైనా వారిని ముందుకు తీసుకెళ్తారు,” అంటూ చెప్పుకొచ్చారు. 

5 /5

“ఆ అమ్మాయి దగ్గర విషయం ఉంది. దేవుడు ఆ అమ్మాయికి రూప లావణ్యన్ని ఇచ్చారు. దానిని నేను బయట ప్రపంచానికి చూపించాను,” అని చెబుతుండగానే ఆ మీడియా మిత్రులు.. మిగతా వాళ్ళు చూపించలేకపోయారు దాన్ని మీరు చూపించారా..? అని ప్రశ్నించగా వెంటనే ఆయన అందుకుని.. తేజ గారు కూడా ముగ్గురు హీరోయిన్లను పరిచయం చేశారు కదా.. సదా, రిమాసేన్, అనిత వంటి వారిని పరిచయం చేశారు కదా అంటూ మళ్ళీ ప్రశ్నించారు. ఆయనకెందుకో అనిపించింది.. ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్కరు ఒక్కోలా అనిపిస్తారు.. అందులో విషయం ఉందా..? లేదా? మాత్రమే గమనిస్తాము అంటూ ఆయన సున్నితంగా క్లారిటీ ఇచ్చారు.