Tabu: బెడ్ షేర్ చేసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాను..టబు ఆసక్తికర వ్యాఖ్యలు

Tabu latest news: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ టబు పెళ్లి వద్దు కానీ అది మాత్రం కావాలి అంటూ హాట్ బాంబ్ పేల్చడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వయసులో ఇలాంటి కోరికలు ఏంటి అంటూ ఈమెపై.. మండిపడుతున్నారు.  

1 /5

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న టబు ఇప్పటికీ 50 ఏళ్ల వయసు దాటినా.. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవితాన్ని కొనసాగిస్తోంది. వాస్తవానికి 50 ఏళ్ల తర్వాత కూడా క్లాసీగా అందంగా కనిపించడం అంటే ఏ భారతీయ నటికైనా అంతే కష్టం అని చెప్పుకోవాలి. అయినా సరే టబు మాత్రం తన బోల్డ్ పర్సనాలిటీని ప్రదర్శిస్తూ బోల్డ్ పర్ఫామెన్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.  

2 /5

క్లాసీ పర్సనాలిటీకి పేరు గాంచిన టబు ప్రస్తుత వయసు 52 ఏళ్లు. బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈమె, ఇప్పటికీ అవివాహితగా ఉండడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అభిమానులు సైతం తెలుసుకోవడానికి తెగ ఆరాటపడుతూ ఉండడం గమనార్హం.    

3 /5

నిజానికి టబు ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ అక్షయ్ కుమార్ వల్లే తను పెళ్లి చేసుకోలేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే గతంలో నాగార్జునతో రిలేషన్‌లో ఉందని, అమలా కూడా వీరి బంధాన్ని యాక్సెప్ట్ చేసిందని వార్తలు జోరందుకున్నాయి. కానీ ఇదే విషయంపై అమలా మాట్లాడుతూ అందులో నిజం లేదు. టబు తన ఫ్యామిలీ ఫ్రెండ్ అని, ఆమె హైదరాబాద్ వస్తే తమ ఇంట్లోనే ఉంటుందని అమల తెలియజేసింది. దీంతో పుకార్లకు కాస్త బ్రేక్ పడింది.  

4 /5

అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పెళ్లి వద్దు, అది కావాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు మాట్లాడుతూ.. పెళ్లిపై ఆసక్తి లేదని, ఒక మగవాడితో బెడ్ షేర్ చేసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాను అని చెప్పి ఆశ్చర్యపరిచింది. ఇక తన రోజు వారి పని చేయడం సంతోషంగా ఉందని, ఇప్పటికీ కెరియర్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకుంటున్నానని టబు వెల్లడించింది.  

5 /5

అయితే టబు ఇలాంటి కామెంట్లు చేయడంతో నెటిజన్లు ఈమెపై ఫైర్ అవుతూ ట్రోల్స్ చేస్తున్నారు. తప్పుడు ఆలోచనలు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి అని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.