Taj Mahal and Agra Fort to reopen Today: ఢిల్లీ: కరోనావైరస్ కారణంగా దేశంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ దాదాపు ఆరు నెలలపాటు మూతబడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అన్లాక్-4లో భాగంగా యూపీలోని తాజమహాల్ (Taj Mahal), ఆగ్రాఫోర్ట్ ఈ రోజు నుంచి (సెప్టెంబరు 21) యాత్రికులకు కనులవిందు చేయనున్నాయి.
అన్లాక్-4లో భాగంగా యూపీలోని తాజమహాల్ (Taj Mahal), ఆగ్రాఫోర్ట్ ఈ రోజు నుంచి (సెప్టెంబరు 21) యాత్రికులకు కనులవిందు చేయనున్నాయి.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తాజ్ మహల్, ఆగ్రా కోటను సందర్శనకు యాత్రికులకు అనుమతిస్తున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆగ్రా సర్కిల్ పేర్కొంది.
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కారణంగా ఈ రెండు ప్రపంచ వారసత్వ కట్టడాలను మార్చి 17 నుంచి మూసివేశారు.
అయితే ఈ రెండు ప్రాంతాల్లో వేర్వేరుగా 2,500 మంది సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.
ముందుగా.. యాత్రికులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు. మాస్క్లులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ మేరకు అధికారులు యాత్రికులకు ఎలక్ట్రానిక్ టికెట్లను జారీ చేసి.. ఎప్పటికప్పుడు తాజ్ మహల్, పోర్ట్ పరిసరాల్లో శానిటైజేషన్ చేస్తున్నారు.