Tamannaah: తమన్నా షాకింగ్ నిర్ణయం.. పెళ్లికి ముందే!

Tamannaah Vijay Verma: మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ చాలా కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి కూడా చేసుకుని సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయిన ఈ జంట ఒక పెద్ద ప్లాన్ కూడా వేశారు. మరి ఆ ప్లాన్ ఏంటో తెలుసా?

1 /5

తమన్నా భాటియా, విజయ్ వర్మల అందమైన ప్రేమకథ ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రమే కాక బాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. 'బాహుబలి' ఫేమ్ తమన్నా, 'డార్లింగ్స్' నటుడు విజయ్ వర్మ 2025లో పెళ్లి పీటలెక్కనున్నారనే వార్త ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది.

2 /5

ఒకవైపు పెళ్లి గురించి పక్కన పెడితే.. తమన్నా, విజయ్ పెళ్లి తర్వాత నివసించేందుకు ముంబైలో ఒక విలాసవంతమైన ఫ్లాట్ కోసం వెతుకుతున్నారు అని సమాచారం. ఇప్పటి వరకు ఈ వార్తలపై ఇద్దరూ అధికారిక ప్రకటన బయటకు రాలేదు. 

3 /5

ముంబై లో చాలా మంది సెలబ్రిటీలు ఉండే బాంద్రా ఏరియా లో సముద్రపు వ్యూ ఉండే ఫ్లాట్ కొనటానికి ఈ జంట రెడీ అయ్యారట. తమన్నా, విజయ్ 2023లో కలిసి పనిచేస్తున్న సమయంలో వారి స్నేహం ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఈ జంట పలు కార్యక్రమాల్లో కలిసి కనిపిస్తూ వస్తున్నారు. 

4 /5

తమ రిలేషన్ గురించి పెద్దగా వీరు ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు వీరి సొంత ఇంటి ప్లాన్ తో ఈ జంట అధికారికంగా తమ పెళ్లి గురించి ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు.  2025 లో ఈ జంట పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

5 /5

తమన్నా భాటియా తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ చిత్రాల్లో కూడా బిజీగా ఉన్నారు. తాజాగా బాలీవుడ్‌లో ఆమె 'స్త్రీ 2' సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ కూడా అందుకుంది. విజయ్ వర్మ తన నటనతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.