Tata Sumo 2025 Model: త్వరలోనే టాటా కంపెనీ నుంచి సుమో 2025 విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Sumo 2025 Model: గత వారం నుంచి సాగుతున్న గ్లోబల్ ఎక్స్పో 2025 మగిసింది. ఈ ఎక్స్‌పోలో భాగంగా కొత్త కొత్త కార్లతో పాటు మోటర్స్ లాంచ్ అయ్యాయి. అంతేకాకుండా కొన్ని కంపెనీలు ఫ్యూటర్లో విడుదల చేయబోయే కార్లను కూడా పరిచయం చేశాయి. ముఖ్యంగా ఈ ఎక్స్‌పోలో ప్రముఖ దేశీ ఆటో కంపెనీ TATAకి సంబంధించిన చాలా కార్లు హైలెట్ అయ్యాయి. టాటా కంపెనీ అనేక కొత్త కార్లను పరిచయం చేసింది. కానీ టాటా కంపెనీ TATA సుమో 2025ను మాత్రం పరిచయం చేయలేకపోయింది.
ప్రస్తుతం TATA సుమో 2025 కారుకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెఫిషికేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ SUV అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల కానుంది.
TATA సుమో 2025 అన్ని SUV కార్ల కంటే ఎక్కువ సెఫ్టీ ఫీచర్స్‌తో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్లో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ మోడల్ మార్కెట్లోకి లాంచ్ అయితే మహీంద్రా స్కార్పియో, XUV 700 వంటి SUVలకు గట్టి పోటీనిచ్చే ఛాన్స్ కూడా ఉంది.
టాటా మోటార్స్ ఈ సుమోకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇది 19 లేదా 20 అంగుళాల చక్రాలతో విడుదల కానుంది. అంతేకాకుండా ఇది EBDతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఈ TATA సుమో 2025 కారు బ్రేక్ అసిస్ట్‌తో పాటు ట్రీ పాయింట్ సిట్ బెల్ట్ సెక్యూరుటీతో విడుదల కానుంది. అంతేకాకుండా లోపలి భాగం చాలా అద్భుతంగా ఉండబోతోంది. అలాగే పగటి ఫ్రంట్ భాగంలో ప్రత్యేకంగా ఇండికేట్ చేసేందుకు రన్నింగ్ లైట్స్ కూడా లభిస్తున్నాయి. అలాగే దీని ఫ్రంట్ భాగంలో ఫ్రంట్ గ్రిల్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ కారు వెనక భాగంలో LED టెయిల్ లైట్స్ కూడా లభించనున్నాయి. టాటా కంపెనీ ఈ కారు ముందుగా రెండు (పెట్రోల్, డీజిల్) వేరియంట్స్‌లో విడుదల చేయబోతోంది. ఈ సుమో 2.0-లీటర్ ఇంజన్‌తో విడుదల కానుంది. దీని ధర రూ.12 నుంచి రూ.14 లక్షలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.