Telangana: తెలంగాణలో భిన్న వాతావరణం.. పొద్దున చలి, మధ్యాహ్నం ఎండ దంచుతోంది..

Telangana Weather Update: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు కాస్త ఎండ తీవ్రత పెరిగింది.  రాత్రి పూట చలి తీవ్రంగా వణికిస్తుంది. మధ్యాహ్నం ఎండ దంచుతుంది. హైదరాబాద్‌ పరిధిలో గరిష్టంగా 30 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
 

1 /5

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఉదయం కాస్త చలి, మధ్యాహ్నం ఎండ, ఇక రాత్రి సమయంలో సాయంత్రం 6 అయితే, చాలు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరిగిపోతుంది.   

2 /5

తెలంగాణలోని పలు జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కానీ, ఎండ మధ్యాహ్నం మాత్రం 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.  దీంతో ఎండలు మళ్లీ దంచికొట్టడం స్టార్ట్‌ అయింది.   

3 /5

ఈ భిన్న వాతావరణంతో ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. సంగారెడ్డిలో రాత్రి ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలు నమోదు అయ్యాయి. కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ 7 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లాలో 8 డిగ్రీలు, వికారాబాద్‌ 9 డిగ్రీలు, కామారెడ్డి 10, రాజన్న సిరిసిల్ల 10 డిగ్రీలు, మహబూబ్‌ నగర్‌ 10 డిగ్రీలు నమోదు అయ్యాయి.  

4 /5

ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) పరిధిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్ర నగర్‌లో 9 డిగ్రీలు, పటాన్‌చేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అయితే, గ్రేటర్‌ పరిధిలో కూడా పగటి పూట ఎండ మాత్రం బాగానే ఉంటుంది.  

5 /5

హైదరాబాద్‌లో ఉదయం పొగ మంచు కమ్మతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక కనిష్టంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతే గరిష్టంగా 32 డిగ్రీలు నమోదు అవుతున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో ఇలాంటి భిన్న వాతావరణంలో కూడా సీజనల్ జబ్బుల వస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.