తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా వరంగల్ లో ముంపు ప్రాంతాలు పెరిగాయి. తెలంగాణ మంత్రులు నేడు వరంగల్ లో ఏయిల్ వ్యూలో పరిస్థితిని తెలుసుకున్నారు. తరువాత క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ఇందులో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితిని వీక్షించిన మంత్రి కేటీఆర్, ఈటెల రాజేందర్ తరువాత ఆర్ట్స్ కాలేజీలో ల్యాండ్ అయ్యారు.
.వరంగల్ లో నేడు ఈ పరిస్థితి ఉండటానికి కారణం అక్రమ నిర్మాణాలే అని తెలిపారు కేటీఆర్.
స్థానిక ప్రజలతో మాట్లాడిన మంత్రులు ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది అని తెలిపారు.
స్థానికంగా ఉన్న నయింనగర్, కేయూ 100 ఫీట్ రోడ్డు ప్రాంతాలను సంద్శించారు.
అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని స్థానికులకు తెలిపారు మంత్రులు