ఐపీఎల్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని గేమ్.
ఐపీఎల్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని గేమ్. ఎన్ని గేమ్ ప్లాన్స్ వేసినా.. చివరికి ఏమవుతుందో తెలియదు. దీనికి కారణం ప్రతీ టీమ్ లో కొంత మంది ప్లేయర్స్.. మ్యాచు గతిని సులభంగా మార్చగలరు. అలాంటి క్రీడాకారులు వీరు. అయితే వీళ్లు ఆట స్వరూపాన్నే కాదు.. పలు సార్లు టీమ్ లు కూడా మార్చారు. ఇలా ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన వారు కూడా వీళ్లే
భారత క్రికెట్ టీమ్ కు అనేక విజయాలు వరించేలా చేసిన యువ్ రాజ్ సింగ్ ఐపీఎల్ లోని కీలక ఆటగాడు. కింగ్ ఎలెవన్ పంజాబ్ టీమ్ కోసం ఎక్కువ మ్యాచులు ఆడిన యువరాజ్..పుణే వారియర్స్, సన్ రైజనర్స్ హైదరాబాద్, ఆర్సీబి, ముంబై తరపున ఆడాడు
వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ అయిన పార్థీవ్ పటేల్ తరచూ టీమ్ప్ మారుస్తూ ఉంటాడు. మొత్తం ఆరు టీమ్స్ మార్చాడు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, కోచి టస్కర్స్, డెక్కన్ ఛార్జర్స్,, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై వంటి టీమ్స్ ఉన్నాయి.
ఇషాంత్ శర్మ తొలూత కోల్ కతా నైట్ రైడర్స్ కోసం ఆడాడు. తరువాత డెక్కన్ ఛార్జర్స్, రైజింగ్ పుణే, పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ మార్చాడు.
కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కెప్టెన్ అయిన దినేష్ కార్తిక్ ఆరు సార్లు టీమ్స్ మార్చాడు. ఇందులో డిల్లీ డేర్ డెవిల్స్, పంజాబ్, ముంబై, గుజరాత్, ఆర్సీబీ టీమ్స్ ఉన్నాయి. Photo - Twitter / @KKRiders
ఆరాన్ ఫించ్ ప్రస్తుతం ఐపీఎల్ లో 10వ సీజన్ ఆడుతున్నాడు. ముందు రాజస్తాన్ రాయల్స్ తో ఐపీఎల్ లో ఆడటం ప్రారంభించిన ఫించ్.. తరువాత ఢిల్లీ డేర్ డెవిల్స్ కోసం రెండు సీజన్లు ఆడాడు. తరువాత పుణె వారియర్స్, సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ టీమ్స్ మార్చాడు. చివరికి ఆర్సీబీలో సెట్ అయ్యాడడు