FD Interest Rates: మూడేళ్లకు 9 శాతం వడ్డీ చెల్లించే టాప్ 5 బ్యాంకులివే

అత్యధిక రిటర్న్స్ కోసం చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తుంటారు. కానీ అన్ని బ్యాంకుల్లో వడ్డీ ఒకేలా ఉండదు. ఒక్కో బ్యాంకులో ఒక్కో వడ్డీ ఉంటుంది. కొన్ని బ్యాంకులు అత్యధిక వడ్డీ ఇస్తుంటే, కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ చెల్లిస్తుంటాయి. మీరు కూడా భారీ వడ్డీ ఇచ్చే బ్యాంకుల గురించి ఆలోచిస్తుంటే..మీ కోసం కొన్ని ఆప్షన్స్ అందిస్తున్నాం. మూడేళ్ల కాలానికి 9 శాతం వడ్డీ ఇచ్చే బ్యాంకులివి..

FD Interest Rates: అత్యధిక రిటర్న్స్ కోసం చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తుంటారు. కానీ అన్ని బ్యాంకుల్లో వడ్డీ ఒకేలా ఉండదు. ఒక్కో బ్యాంకులో ఒక్కో వడ్డీ ఉంటుంది. కొన్ని బ్యాంకులు అత్యధిక వడ్డీ ఇస్తుంటే, కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ చెల్లిస్తుంటాయి. మీరు కూడా భారీ వడ్డీ ఇచ్చే బ్యాంకుల గురించి ఆలోచిస్తుంటే..మీ కోసం కొన్ని ఆప్షన్స్ అందిస్తున్నాం. మూడేళ్ల కాలానికి 9 శాతం వడ్డీ ఇచ్చే బ్యాంకులివి..

1 /5

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు మూడేళ్ల ఎఫ్‌డీపై 8.5 శాతం ఇస్తోంది. ఇది కాకుండా జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా మూడేళ్ల ఎఫ్‌డీపై 8.25 శాతం వడ్డీ చెల్లిస్తోంది.

2 /5

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు మూడేళ్ల ఎఫ్‌డీపై 8.6 శాతం వడ్డీ ఇస్తోంది. మూడేళ్ల తరువాత డబ్బులు వడ్డీతో కలిపి వస్తుంది

3 /5

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు మూడేళ్ల ఎఫ్‌డిపై 9 శాతం వడ్డీ చెల్లిస్తోంది.   

4 /5

ప్రతి బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీపై 0.25 నుంచి 0.50 శాతం ఎక్కువ లభిస్తుంది. ఈ బ్యాంకుల జాబితా ఓసారి చెక్ చేద్దాం. ఫిక్స్డ్ డిపాజిట్లపై 9 శాతం వడ్డీ అందిస్తున్నాయి.

5 /5

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల ఎఫ్‌డీపై 8.15 శాతం వడ్డీ ఇస్తోంది. ఇది కాకుండా ఈక్విటాక్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల ఎఫ్‌డిపై 8 శాతం వడ్డీ చెల్లిస్తోంది.