Train Accident Movies: రైలు ప్రమాదాలపై వచ్చిన సినిమాలు ఇవే..!

Odisha Train Accident News: ఒడిశా మూడు ట్రైన్లు ఢీకొట్టిన ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ ఘోర దుర్ఘటన దృశ్యాలు భయాందోళనకు గురిచేశాయి. అయితే విస్తుపోయే దృశ్యాలను సినిమాల్లో ఎప్పుడో తీశారు. రైలు ప్రమాదాలపై బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయి. ట్రైన్ యాక్సిడెంట్‌పై తీసిన కొన్ని సినిమాలు ఏవో తెలుసుకోండి..
 

1 /5

వినోద్ ఖన్నా, ధర్మేంద్ర, హేమమాలిని, జీతేంద్ర, పర్వీన్ బాబీ, డానీ వంటి స్టార్స్‌ కలిసి నటించిన మూవీ ది బర్నింగ్ ట్రైన్. ఈ మూవీ కథలో కదులుతున్న రైలుకు మంటలు అంటుకుంటాయి. ఆ తరువాత బ్రేకులు కూడా ఫెయిల్ అవుతాయి. దీంతో ట్రైన్‌లో ఉన్న వేల మంది ప్రాణాలు కాపాడే క్రమంలో ట్విస్టులు, సన్నివేశాలు ఉత్కంఠతను రేపుతాయి.   

2 /5

డిజాస్టర్ ఆన్ ది కోస్ట్‌లైనర్ అనే అమెరికన్ టెలివిజన్ యాక్షన్ డ్రామా చిత్రం 1979లో వచ్చింది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొట్టిన ఘటన ఆధారంగా ఈ సినిమా కథను తెరకెక్కించారు.  

3 /5

నిజ జీవితంలో జరిగిన ప్రమాదం ఆధారంగా అన్‌స్టాపబుల్ సినిమాను రూపొందించారు. 2010 అమెరికన్ డిజాస్టర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి టోనీ స్కాట్, డెంజెల్ వాషింగ్టన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత CSX 8888 సంఘటన ఆధారంగా తెరకెక్కింది.    

4 /5

అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రన్అవే రైలు 1985లో విడుదలైంది. ట్రైన్‌లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తుల కథ ఇది. ఆ రైలు అలాస్కా మంచులో రన్నింగ్‌లో ఉంటుంది. ఈ చిత్రం ఆస్కార్‌కి కూడా నామినేట్ అయింది.   

5 /5

థ్రిల్లర్, హారర్ చిత్రం డి-రైల్డ్ 2019లో విడుదలైంది. రైలు ప్రమాదం తర్వాత నదిలో పడిపోతుంది. ప్రజలు మునిగిపోతున్న రైలులో చిక్కుకుంటారు. ఆ తరువాత ఏం జరిగిందనేది స్టోరీ.