Sri Rama Navami 2024: అయోధ్య రామయ్యకు పంపేందుకు 1,11,111 కిలోల లడ్డూలు సిద్దం..

Ayodhya Ram lalla: అయోధ్య రామయ్యకు పంపేందుకు  యూపీలోని మీర్జాపూర్ కు చెందిన భక్తుడు ప్రత్యేంకంగా బూందీ లడ్డులు రెడీ చేయిస్తున్నాడు. దాదాపు..1,11,111 కిలోల లడ్డూలను శ్రీ రామనవమి రోజున పంపిణి చేయనున్నట్లు తెలుస్తోంది.
 

1 /6

వందల ఏళ్ల అయోధ్య కళ ఈసారి సాకారామైంది. అయోధ్యలో ప్రసిద్ధ రామ్ లల్లా విగ్రహాన్ని ఎంతో వైభవంగా ప్రతిష్టించారు. ఈసారి రామయ్య తన జన్మభూమిలో శ్రీరామనవమి వేడులకు జరుపుకోనున్నాడు. ప్రధాని మోదీ ఎందరో అతిరథ మహారథుల ఆధ్వర్యంలో భవ్య రామమందిరం నిర్మాణ కలసాకారం అయ్యేలా చేశారు.

2 /6

అయోధ్య రామాలయం విగ్రహాం ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి కులమతాలకు అతీతంగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి రామ్ లల్లాను దర్శించుకుంటున్నారు. అనేక మంది భక్తులు తమ కానుకలను హుండీలో సమర్పించి,మొక్కలు చెల్లించుకుంటున్నారు.

3 /6

ఇప్పటికే అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభమైపోయాయి. అదే విధంగా శ్రీ రామనవమి రోజున ఈసారి బాలరాముడి నుదుటిపైన సూర్యకిరణాలు నేరుగా పడేటట్లు ఏర్పాట్లు చేశారు. ప్రతిఏటా నవమి రోజు ఈ అద్భుత ఘటన సాకారంఅయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

4 /6

మరోవైపు అయోధ్యకు వీఐపీ భక్తులతో పాటు, సామాన్య భక్తుల తాకిడి కూడా విపరీతంగా ఉన్నట్లు సమాచారం. విమానం, రైల్వే, బస్సుల మార్గాల ద్వారా పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా రామ్ లల్లాను దర్శించుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

5 /6

ఇదిలా ఉండగా.. శ్రీరామనవమి రోజున రామయ్య ఆలయంలో స్వామి వారికి నైవేద్యంగా సమర్పించడానికి 1,11,111 కిలోల లడ్డూలను మీర్జాపూర్ దేవ్ రహ హాన్స్ బాబా ట్రస్టు తయారు చేస్తుంది.  వీటిని తొందరలోనే అయోధ్యకు పంపించనున్నట్లు తెలుస్తోంది. 

6 /6

ఇదిలా ఉండగా ఇదే ట్రస్ట్ రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టాపన సమయంలో కూడా నలభైవేల లడ్డులను అయోధ్యకు పంపించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ లడ్డులను రామయ్య భక్తులకు పంపేలా ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు కూడా లడ్డులను స్వామివారికి నివేదించి ఆతర్వాత ప్రసారంగా భక్తులకు పంపిణి చేస్తారు.