Varun-Lavanya photos: గత కొద్దిరోజులుగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ఆకట్టుకుంటున్నాయి. కొత్తగా పెళ్లయిన ఈ మెగా కపుల్ ఏ ఫోటో పెట్టినా చాలు క్షణాల్లో వైరల్ అవుతుంది. కాగా దీపావళి కి స్పెషల్ కాస్ట్యూమ్స్ తో వీరిద్దరూ దిగిన ఫోటోషూట్.. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
Varun-Lavanya photoshoot: మెగా కపుల్ వరుణ్ తేజ్ - లావణ్య పెళ్లి సంబరాలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం దీపావళి సెలబ్రేషన్స్ కూడా అంతే కలర్ఫుల్గా జరుపుకున్నారు ఈ కొత్త జంట.
నవంబర్ 12న ఫ్యామిలీతో కలిసి తాము చేసుకున్న దీపావళి సెలబ్రేషన్స్ షేర్ చేశారు వరుణ్ - లావణ్య. కాగా నవంబర్ 13న వీరిద్దరి ఫోటోషూట్ ఫోటోలు షేర్ చేసి మరింత ఆకట్టుకున్నారు.
వరుణ్‌తేజ్‌తో కలిసి లావణ్య త్రిపాఠి సంప్రదాయబద్దకంగా గార్జియస్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది.
ఈ ఫోటోలలో వరుణ్‌తేజ్ బ్లాక్ అండ్ వైట్ శర్వణీ వేసుకుంటే..లావణ్య మెరూన్ కలర్ డ్రెస్‌లో భర్త షర్ట్ గుండీలు సరి చేస్తూ నవ్వుతూ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
ఈ ఫోటోలు చూసి అభిమానులు సూపర్ పైర్ అని కామెంట్లు పెడుతున్నారు. కాగా జూన్ 09న కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరికి నిశ్చితార్ధం జరగగా.. నవంబర్ 01న ఇటలీలో ఈ జంట వివాహ బంధంలో అడుగుపెట్టింది.