Shalini Pandey: అబ్బాయిలతో రూమ్‌ షేర్ చేసుకున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. అలా దుస్తులు మార్చుకున్నా..!

Shalini Pandey Share Room With Boys: తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకుని.. మంచి గుర్తింపు తెచ్చుకుంది అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా.. ఆ స్థాయి క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. దీంతో ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రీసెంట్‌గా మహారాజ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను పంచుకుంది.
 

1 /6

షాలినీ పాండే 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. చదువుకునే రోజుల్లోనే సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉందని తండ్రికి చెప్పగా.. ఆయన ఇంజినీరింగ్ చేయాల్సిందేనని పట్టుబట్టారు.   

2 /6

అయితే తండ్రిని ఒప్పించేందుకు నాలుగేళ్లు ప్రయత్నించినా.. ఆయన అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వెళ్లిపోయింది.  

3 /6

అలా ఇంటి నుంచి వచ్చే తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి రూమ్‌లో ఉంది. అయితే వాళ్ల దగ్గర ఉండలేకపోయింది. ఆ తరువాత అబ్బాయిలతో రూమ్‌ షేర్ చేసుకున్నట్లు షాలినీ పాండే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.  

4 /6

వాళ్లతో భయపడకుండా ఉన్నానని.. బట్టలు మార్చుకునేందుకు ప్లేస్ లేకపోయినా చాటుగా మార్చుకునేదాన్ని అని గుర్తు చేసుకుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అక్కడే ఉండి.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించానని తెలిపింది.  

5 /6

ఆ సమయంలోనే తనకు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాలో ఛాన్స్ ఇచ్చారని.. తన ఫస్ట్ మూవీ అయినా భారీ విజయం సాధించడంతో పాపులారిటీ వచ్చిందని షాలినీ పాండే చెప్పింది.  

6 /6

స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో తన కుటుంబం అండగా నిలిచిందని తెలిపింది. విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ రావడమే తాను అదృష్టంగా భావించానని పేర్కొంది.