వివో రహస్యంగా, ఏమాత్రం ఆర్భాటం లేకుండా అత్యంత చౌకధరకు స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ పేరు Vivo Y02. వివో స్మార్ట్‌ఫోన్ మరో మోడల్ Vivo Y01 2022లో లాంచ్ అయింది. ఇప్పుడు కొత్త వెర్షన్ Vivo Y02 లాంచ్ అయింది. ఇందులో 6.5 ఇంచెస్ డిస్ప్లే, 8 మెగాపిక్సెల్ కెమేరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Vivo Y02 ఆండ్రాయిడ్ 12 గో ఆధారంగా నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సిమ్, 4జి వోల్ట్, బ్లూటూత్ 5, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రం లేదు. ఈ ఫోన్ బరువు కేవలం 186 గ్రాములు మాత్రమే.
Vivo Y02 ధర ఇండియాలో 7,760 రూపాయలు మాత్రమే. ఈ ఫోన్ ఆక్వా బ్లూ, క్లాసిక్ రంగుల్లో లభ్యం కానుంది. ఇతర ఆసియా దేశాల్లో కూడా లాంచ్ కానుంది.
Vivo Y02లో 6.5 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ ఉంటుంది. స్క్రీన్ 720 x 1600 పిక్సెల్ హెచ్డి ప్రస్ రిజల్యూషన్‌తో ఉంటుంది. ఈ ఫోన్ ఆక్టా కోర్ ప్రోసెసర్‌తో నడుస్తుంది. ఇందులో 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంది. ఇక 8 మెగాపిక్సెల్ కెమేరా, ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ఉన్నాయి.
Vivo Y02లో హెలియో పి22 చిప్‌తో నడుస్తుందని తెలుస్తోంది.
Vivo Y02లో 2 జీబీ, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఉంటాయి. స్టోరేజ్ మాత్రం మైక్రో ఎస్డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ మరో ప్రత్యేకత. ఇందులో 10 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.