Watermelon Health Benefits: పుచ్చకాయ పండులో 90% పైగా నీరు ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు అందుతాయి.. పుచ్చకాయను ఎండాకాలంలో బాగా తింటారు, విరివిగా లభిస్తాయి. అయితే మన రెగ్యులర్ డైట్ లో పుచ్చకాయలు చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం.
పుచ్చకాయ మన శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. జీర్ణ క్రియకు మేలు చేస్తుంది. అంతేకాదు పుచ్చకాయను డైట్లో చేర్చుకుంటే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. మన శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపించడంతోపాటు చర్మం జుట్టుకు ఆరోగ్యం.
పుచ్చకాయ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించి మలబద్ధక సమస్య రాకుండా కాపాడుతుంది.
పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లైకోపీన్, బీటా కెరోటిన్ ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా నివారిస్తుంది. 50% పైగా ప్రాణాంతక వ్యాధులు మన దరిచేరకుండా కాపాడుతుంది.
పుచ్చకాయను తీసుకోవడం వల్ల చర్మం జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, కొల్లెజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.. చర్మానికి సాగే గుణం అందిస్తుంది. మన చర్మానికి హైడ్రేషన్ అందిస్తుంది. పుచ్చకాయలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.. సీజనల్ జబ్బులు రావు జ్వరం, దగ్గు, సైనస్ వంటి లక్షణాలు రాకుండా నివారిస్తుంది.
బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవాళ్లు పుచ్చకాయ తినాలి. ఇందులో పొటాషియం ఉంటుంది.. పుచ్చకాయ సోడియం స్థాయిలను సమతులం చేస్తుంది. దీంతో హైపర్ టెన్షన్ సమస్య రాదు. కార్డియో ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా పుచ్చకాయ మేలు చేస్తుంది. కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది.