Black Friday: బ్లాక్ ప్రైడే. ఈ పేరు తరచూ వివిధ రకాల ఆన్ లైన్ ఈ కామర్స్ వేదికల నుంచి వింటుంటాం.. భ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటూ. బ్లాక్ ఫ్రైడే అనేది వాస్తవానికి అమెరికాలో చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రోజున కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు అందిస్తుంటారు. అసలీ బ్లాక్ ఫ్రైడే గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
బ్లాక్ ఫ్రైడే రోజున మంచి ఆఫర్లు ఉంటాయని అందరూ షాపింగ్ చేస్తుంటారు. క్రిస్మస్ షాపింగ్ ముందే చేస్తుంటారు. చాలా వరకూ ఆదా అవుతుందని భావిస్తారు.
చాలామంది విక్రేతలు ఈ రోజున పాత స్టాక్‌పై డిస్కౌంట్ ఇచ్చి క్లియర్ చేయడం ద్వారా కొత్త స్టాక్‌కు స్థానం కల్పిస్తుంటారు. బ్లాక్ ఫ్రైడే రోజు నుంచి షాపులు ఉదయం త్వరగా తెరుస్తుంటారు. మార్కెట్లలో కూడా ఎక్కువ రష్ కన్పిస్తుంది.
బ్లాక్ ఫ్రైడే నుంచే కస్టమర్లకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభిస్తుంటాయి. కొనుగోళ్ల సీజన్‌గా అబివర్ణిస్తారు. ఈ రోజు నుంచి అందరూ హాలిడే షాపింగ్ చేస్తుంటారు.
ఈ ఏడాది నవంబర్ 24న బ్లాక్ ఫ్రైడే జరుపుకున్నారు. అసలీ బ్లాక్ ఫ్లైడ్ అనే పదం ఎలా వచ్చింది. బ్లాక్ ఫ్రైడే అనేది అమెరికాలో ప్రారంభమైంది. ఆ తరువాత ఇతర దేశాల్లో ఈ పరంపర కొనసాగింది. నష్టాల్లో ఉండే వ్యాపారులు ఈ రోజు నుంచి లాభాలు ఆర్జిస్తారని అంటారు. అందుకే పెద్దఎత్తున ఆఫర్లు ఇస్తుంటారు
అమెరికాలో బ్లాక్ ఫ్రైడే అనేది థ్యాంక్స్ గివింగ్ డే తరువాత వస్తుంది. ఇంకా సులభంగా అర్ధం కావాలంటే నవంబర్ నెలలోని నాలుగవ గురువారాన్ని బ్లాక్ ఫ్రైడే అంటారు. కొనుగోళ్ల పరంగా ఈరోజు చాలా మంచిదని నమ్మకం. ఎందుకంటే ఈ రోజున క్రిస్మస్ కొనుగోళ్లు ప్రారంభమౌతాయి.