WhatsApp Udates | వాట్సాప్‌ను సొంతం చేసుకున్న తరువాత ఫేస్బుక్ ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది వినియోగదారులున్నారు.
అంతర్జాతీయంగా టాప్ మెసేజింగ్ యాప్.. సుమారు 190 దేశాలకన్నా ఎక్కువ దేశాల్లో వాట్సాప్‌ను వినియోగిస్తారు.
మరి ఇంత మందికి కావాల్సిన ఫీచర్ల సిద్ధం చేయడానికి వాట్సాప్ నిర్వాహకులు నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి మరొక అప్డేట్స్ తీసుకొచ్చింది.
ఇకపై ఎలాంటి కొత్త అప్డేట్ వచ్చినా అది డైరక్ట్‌గా యాప్‌లో తెలియనుంది. అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి బ్లాగ్స్, సోషల్ మీడియాలో చెక్ చేయాల్సిన అవసరం లేదు.
దీన్ని ఇన్ యాప్ నోటిఫికేషన్ అంటారు. అయితే ఇది మనకు చాట్స్ చూపంలో తెలియదు. బ్యానర్లో మనకు ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే కనిపిస్తుంది.
దీంతో పాటు వాట్సాప్ మరో కొత్త అప్డేట్ తీసుకువచ్చింది. ఇకపై మనం వాట్సాప్ షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది.
దాని కండీషన్స్ నిరాకరించాలి అనుకుంటే మాత్రం మనం ఎకౌంట్ డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది.