Zinc Rich Foods in Telugu: శరీర నిర్మాణం, ఎదుగుదలలో వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ పాత్ర చాలా కీలకం. ఇందులో కీలకమైంది జింక్. ఈ ఒక్క మినరల్ చాలా రకాల పనులు చేస్తుంది.రోగ నిరోధక శక్తిని పెంచడం, గాయాలు తగ్గించడం, డీఎన్ఏ నిర్మాణంలో జింక్ ముఖ్య భూమిక వహిస్తుంది.
Zinc Rich Foods in Telugu: శరీరంలో జింక్ లోపముంటే బలహీనత, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, చర్మ సంబంధిత సమస్యలు ఎదురౌతాయి. జింక్ లోపాన్ని సరిచేసేందుకుకొన్ని ముఖ్యమైన ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి.
శెనగలు శెనగల్లో జింక్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ప్రోటీన్లు, ఫైబర్ వంటి ఇతర పోషకాలు ఉంటాయి. రోజూ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటుంది.
జీడిపప్పు శరీరంలో జింక్ లోపాన్ని సరి చేసేందుకు తీసుకోవల్సిన ముఖ్యమైన పదార్ధాల్లో జీడిపప్పు ఒకటి. ఇందులో ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ ఇలా చాలా ఉంటాయి. ఇవి శరీరం హెల్తీగా ఉండేందుకు దోహదపడుతుంది. జింక్ లోపం సరి చేయడమే కాకుండా ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది
రాజ్మా ఇక చాలామంది ఇష్టంగా తినే రాజ్మాలో జింక్ శాతం చాలా ఎక్కువ. ఉత్తరాదిన ఇదొక ప్రసిద్ధ డిష్. శాకాహారులకు ఇది మంచి ప్రత్యామ్నాయం. ఇందులో జింక్‌తో పాటు ఇతర పోషకాలు కూడా చాలా ఉంటాయి.
ఆనపకాయ గింజలు ఆనపకాయ గింజల్లో జింక్ పెద్దమొత్తంలో ఉంటుంది. జింక్ ఒక్కటే కాకుండా ఇందులో మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫలితంగా శరీరాన్ని చాలా లాభాలున్నాయి. రోజూ ఆనపకాయ గింజలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది.
డార్క్ చాకొలేట్ జింక్ లోపాన్ని సరి చేసే అద్భుతమైన పదార్ధం డార్క్ చాకోలేట్. కోకోతో చేసే డార్క్ చాకోలెట్‌లో జింక్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఇందులో కేలరీలు కూడా చాలా ఎక్కువ.