Oye Re Release: 'ఓయ్‌' రీ రిలీజ్‌ క్రేజ్‌.. థియేటర్‌లో యువతి డ్యాన్స్‌ అదుర్స్‌ వావ్ వావ్

Oye Re Release Dance: థియేటర్‌లలో సినిమాలు రీ రిలీజ్‌తో సందడి చేస్తుంటే.. అదే రీతిలో ప్రేక్షకులు, అభిమానులు సందడి చేస్తున్నారు. మళ్లీ విడుదలైన ప్రతి సినిమాకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆదరించడమే కాకుండా థియేటర్‌లో డ్యాన్స్‌లు, అరుపులు, కేకలు, పాటలను హమ్మింగ్‌ చేస్తూ ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఓ యువతి థియేటర్‌లో డ్యాన్స్‌ చేస్తూ మెస్మరైజ్‌ చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 15, 2024, 05:53 PM IST
Oye Re Release: 'ఓయ్‌' రీ రిలీజ్‌ క్రేజ్‌.. థియేటర్‌లో యువతి డ్యాన్స్‌ అదుర్స్‌ వావ్ వావ్

Young Girl Mesmerising Dance In Theatre: ఎక్కడా లేని విధంగా తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్‌ సంస్కృతి కొనసాగుతున్నది. హీరోలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల మది దోచిన సినిమాలు తిరిగి విడుదలవుతున్నాయి. ఈ సినిమాల విడుదల సందర్భంగా థియేటర్లలో అభిమానులు, ప్రేక్షకులు రచ్చరచ్చ చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా అయితే ఇక అభిమానులు కేరింతలు కొడుతూ డ్యాన్స్‌లు చేస్తూ రెచ్చిపోతున్నారు.

Also Read: Amitabh Jaya Bachchan Assets: బాలీవుడ్‌ మెగాస్టార్‌ ఆస్తుల్లోనూ నంబర్‌వన్‌? ఆస్తులు, కార్లు, ఇతర వివరాలు ఇవిగో..

అదే మాదిరి ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మాంచి టాక్‌ సొంతం చేసుకున్న 'ఓయ్‌' సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన మళ్లీ విడుదల చేసిన సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ప్రేమికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాగా ఈ సినిమాకు వెళ్లిన ఓ యువతి హీరోయిన్‌ కన్నా అద్భుతంగా డ్యాన్స్‌ చేసి అదుర్స్‌ అనిపించింది. అందరూ సినిమాను చూడడం వదిలేసి ఆమె డ్యాన్స్‌ను చూస్తూ ఉన్నారు.

Also Read: Tillu Square Trailer: టిల్లు అనే వాడు కారణజన్ముడు.. ఈసారి గట్టిగానే దెబ్బ తగిలేటట్టున్నది?

ఒక రిథమిక్‌లో.. పాటకు తగ్గట్టు డ్యాన్స్‌ చేసి ఆ యువతి అదరగొట్టింది. ఆరెంజ్‌ కలర్‌ చీరలో అందంగా ఉన్న యువతి మరింత అందంగా డ్యాన్స్‌ చేయడంతో థియేటర్‌లో ఈలలు, కేకలతో మార్మోగిపోయింది. విశాఖపట్టణంలోని దొండపర్తిలోని సంగం శరత్‌ థియేటర్‌లో 'ఓయ్‌' సినిమా చూడడానికి వచ్చిన యువతి సందడి చేసింది. సినిమాలోని అన్ని పాటలకు ఫుల్‌ జోష్‌లో డ్యాన్స్‌ చేస్తూ సినిమాను పూర్తి ఆస్వాదించింది. ఇక 'అనుకోలేదు ఏనాడూ ఈలోకం నాకోసం అందంగా' అనే పాట రాగానే  డ్యాన్స్‌ చేసి అందరినీ ఫిదా చేసింది. నెమలిలా డ్యాన్స్‌ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'సినిమాలో ట్రై చేయండి' అని కొందరు సూచిస్తుండగా.. మరికొందరు 'సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ కోసం రీల్స్‌ చేసేందుకు ఇలాంటివి ప్రయత్నిస్తున్నారు' అని పేర్కొంటున్నారు. 

సిద్ధార్థ్‌, షామిలి జంటగా ఆనంద్‌ రంగ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓయ్‌' సినిమా 3 జూలై 2009లో విడుదలైంది. అప్పట్లో ఆ సినిమా మంచి పాజిటివ్‌ టాక్‌తో మొదలై అనంతరం సిద్ధార్థ్‌ కెరీర్‌లో మరో హిట్‌ పడింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. రూ.10 కోట్లతో తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో దాదాపు రూ.40 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికీ ఆ పాటలను ప్రేక్షకులు మరచిపోలేరు.

ఇక ఈ సినిమాలో బాల నటిగా ఉన్న షామిలి ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. రీ రిలీజ్‌ అయిన ఓయ్‌ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో యమ క్రేజీ ఏర్పడింది. ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివస్తున్నారు. సినిమాలోని డైలాగ్‌లు, పాటలకు కేరింతలు కొడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ జంటలు ఈ సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News