జమ్మూ కాశ్మీర్లో యువత తీవ్రవాదం వైపు మొగ్గుచూపకుండా భారత ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ, సరిహద్దు భద్రతా బలగాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ... తీవ్రవాదులు మాత్రం వారిని తమవైపు ఆకర్షితులని చేసుకోవడంలో ఎక్కడో ఓ చోట సఫలమవుతూనే వున్నారని మరోసారి రుజువైంది.
'భారతదేశంలో హిందూ తీవ్రవాదం ఉందని చెప్పలేం' అని నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. హిందూ ఉగ్రవాదం కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కొన్ని రాష్ట్రాలలో ఈ పరిస్థితి దారుణంగా తయారైయింది' అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై బీజీపీ మండిపడింది. కొన్ని చోట్ల దిష్టిబొమ్మలు, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయితే కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు ప్రకాష్ రాజ్ సమర్ధిస్తూ.. తనదైన శైలిలో ట్విట్టర్ లో కౌంటర్ విసిరారు. అందులో ఏముందంటే..
ఉగ్రవాదంపై పోరుకు అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న ఖర్చు వింటే ఎవరైనా ఎవరైనా షాక్ తినాల్సిందే..రోజుకు ఏకంగా రూ.1600 కోట్లు ఖర్చు చేస్తుందట..ఈ విషయాన్ని అమెరికా రక్షణ విభాగం వార్షిక నివేదికలో వెల్లడించింది. కాగా ఆప్ఘాన్, ఇరాక్ లలో యుద్ధానికి రూ. 84 లక్షల కోట్లు ఖర్చు చేయగా... ఇరాక్, సిరియాలలో రూ. 1.1 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు నివేదికలో తెలిపింది.
అమెరికాలోని న్యూయార్క్లో బుధవారం జరిగిన ఉగ్రదాడిలో 8 మంది ప్రాణాలు కొల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిని భారత్తో సహా ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందిస్తూ న్యూయార్క్ లో ఉగ్రదాడి జరగడం బాధాకరమన్నారు. ఈ దాడిలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ట్విటర్ వేదికగా మోడీ స్పందిస్తూ.. ‘‘న్యూయార్క్ నగరంపై ఉగ్రదాడికి తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను...’’ అని పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.