telangana polycet 2021 application last date extended: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం తెలంగాణలో అన్ని ప్రవేశపరీక్షలకు సంబంధించిన దరఖాస్తు గడువు పొడిగిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. అదే బాటలో తాజాగా తెలంగాణ పాలిసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువును కూడా మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
TS LPCET 2021 important dates: హైదరాబాద్: తెలంగాణలో ఎల్పీ సెట్ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఐటీఐ చదివి, పాలిటెక్నిక్ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో అడ్మిషన్ కోరుకునే విద్యార్థులు ఈ ఎల్పీ సెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
TS Model school entrance exam application last date: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణలోని మోడల్ స్కూల్స్‌లో అడ్మిషన్స్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
JEE Main March Result 2021 declared: జేఈఈ మెయిన్ మార్చ్ ఎగ్జామినేషన్ 2021 కి సంబంధించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. తమ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని ఎన్టీఏ ప్రకటించింది. ఈ ఫలితాలను వెల్లడించడానికంటే ముందే ఎన్టీఏ ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. JEE Main March scorecards download చేసుకోవాలంటే అభ్యర్థులు తమ అఫిషియల్ లాగిన్ క్రెడిన్షియల్స్‌తో సైట్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది.
Akshara Trailer and Akshara release date: టైటిలర్ క్యారెక్టర్లో నందితా శ్వేత నటించిన అక్షర మూవీ ట్రైలర్ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థ ఎలా వ్యాపారమైందనే కోణంలో సినిమా కథాంశం ఉండనున్నట్టు అక్షర ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతబడిన సంగతి తెలిసిందే. 11 నెలల సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం (Telangana Govt) చర్యలు చేపట్టింది.
Girl Education : బాలికల విద్యాభ్యాసం విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. బాగా చదివి మెరిట్ సాధించే విద్యార్థినులకు స్కూటీలు అందించాలి అని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు అస్సాం విద్యాశాఖ మంత్రి హిమంతా బిస్వా శర్మ ఒక ప్రకటన విడుదల చేశాడు.
Telagana Board Of Education on SSC Exmas 2021 | కరోనావైరస్ సంక్రమణ వేగంగా పెరుగుతున్న సమయంలో తెలంగాణ ఎడ్యుకేషన్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో జరగబోయే టెన్త్, ఇంటర్ పరీక్షలపై తన నిర్ణయాన్ని ప్రకటించింది.
AP ECET 2020 Counselling | ఏపీ ఈసెట్ 2020 కౌన్సెలింగ్ తేదీని పొడగిస్తున్నట్టు కన్వీనర్ ఎమ్ ఎమ్ నాయక్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆర్డర్స్ జారీ చేశారు. ప్రాసెసింగ్ ఫీజు, ఫీజు చెల్లించే తేదీ, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కాలీజీల ( Colleges ) ఎంపిక, కోర్సుల గడువును నవంబర్ 11 వరకు పొడగిస్తున్నట్టు ఆయన తెలిపారు.
తెలంగాణ ఎంసెట్ ( TS EAMCET 2020) పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ( Telangana Government ) విద్యార్థులందరికీ కౌన్సెలింగ్ అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నేటినుంచి నేటినుంచి (శనివారం) టీఎస్ ఎంసెట్ చివరి విడుత కౌన్సెలింగ్ (final counselling) ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఏపీ లాసెట్ (AP LAWCET 2020) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. మొదటిసారి విడుదల చేసిన ‘ప్రాథమిక కీ’లో తప్పులు ఉండటంతో మరోసారి అధికారులు ఫలితాలను విడుదల చేశారు.
కరోనావైరస్ కారణంగా అన్నీ పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల నుంచి ఇటు కేంద్రంతోపాటు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాయిదా పడిన పరీక్షలను నిర్వహిస్తూ వస్తూన్నాయి. దీనిలో భాగంగా సీబీఎస్ఈ నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (CTET) పరీక్ష సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే.
TSBIE | ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ తీసుకునే చివరి తేదీనీ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) పొడగించింది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ చివరి తేదీని నవంబర్ 16 తేదీకి పొడగించింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎంసెట్ – 2020 (AP EAMCET 2020) కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కౌన్సెలింగ్ (Counseling Notification) ప్రక్రియ జరగనుంది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి విజృంభిస్తునే ఉంది. నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్‌లాక్ 5.0 లో భాగంలో అక్టోబరు 15 నుంచి పాఠశాలలు, కళాశాలలలను తిరిగి తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.
తెలంగాణలో ప్రవేశపరీక్షల (entrance exams) తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు ఖరారు చేసింది. కరోనా మహమ్మారి (Coronavirus) కారణంగా తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ ఎక్సామ్స్ రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఎక్కాలు కూడా రాని మాస్టార్ల చేతిలో రేపటి పౌరుల 'భవిష్యత్'.. ఈ విషయం గురించి మాటల్లో చెప్పడం కంటే.. దృశ్యరూపంలో చూస్తేనే బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై ఓ లుక్కేయండి..
ఏపీ కేబినెట్ సమావేశంలో అమ్మఒడి పథకానికి ఆమోదం లభించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అందరు విద్యార్థులకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని మంత్రి తెలిపారు. తల్లి లేని పిల్లల విషయంలో వారి సంరక్షకులకు ఆ ఆర్థిక సహాయాన్ని అందిస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.