నిర్భయ కేసులో దోషి పవన్ కుమార్ గుప్తా చేసిన చివరి ప్రయత్నం విఫలమైంది. నిర్భయపై గ్యాంగ్ రేప్ చేసిన సమయంతో తాను మైనర్ అని, జువైనల్‌గా శిక్ష ఖరారు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు దోషులను నిర్భయ తల్లి క్షమించి వదిలేయాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జై సింగ్ చేసిన విజ్ఞప్తి నిర్భయ తల్లి చాలా ఘాటుగా స్పందించారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దోషులను సోనియా గాంధీ క్షమించినట్లుగానే.. నిర్భయ తల్లి నలుగురు దోషులను క్షమించాలని సీనియర్ న్యాయవాది తనను కోరడం ఏంటని మండిపడ్డారు. నీలాంటి వారి వల్లే అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని ఇందిర జైసింగ్‌పై నిర్భయ తల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు దోషులకు క్షమాభిక్ష పెట్టాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోరడం వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దోషులను సోనియా గాంధీ క్షమించినట్లుగానే.. నిర్భయ తల్లి నలుగురు దోషులను క్షమించాలని సీనియర్ న్యాయవాది కోరారు.
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పోటీగా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆశా దేవి పై విధంగా స్పందించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. నిర్భయ కేసులో దోషులకు జనవరి 22న మరణశిక్ష అమలు చేయడం లేదు. తాజా డెత్ వారెంట్ ప్రకారం ఉరిశిక్ష అమలు ఫిబ్రవరి 1కి వాయిదా పడింది.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో దోషి ముకేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్ద తిరస్కరించారు. గురువారం (జనవరి 16) రాత్రి ముకేశ్ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు కేంద్ర హోం మంత్రిత్వశాఖ పంపించింది.
నిర్భయ కేసు దోషులలో ఒకరైన ముకేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్దకు చేరింది. గురువారం (జనవరి 16) రాత్రి ముకేశ్ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపించినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది.
నిర్భయ కేసు దోషులకు విధించిన డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుచేయాలని ఆదేశిస్తూ ఢిల్లీ పాటియాలా హైకోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌లో ఎలాంటి తప్పిదం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
నిర్భయ అత్యాచారం, హత్య దోషుల మరణ శిక్ష అమలు విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పాటియాలా హౌస్ కోర్ట్ డెత్ వారెంట్ ప్రకారం దోషులు నలుగురిని జనవరి 22న కచ్చితంగా ఉరితీయడం కుదరదని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు తెలిపింది.
Nirbhaya Case Convicts Curative Plea: జనవరి 14న ఎన్వీ రమణ నేతృత్వంలోని అరుణ్ మిశ్రా, ఆర్.ఎఫ్ నారిమన్, ఆర్ భానుమతి, అశోక్ భూషణ్ ధర్మాసనం విచారణ జరపనుంది. తమ తుది నిర్ణయాన్ని సైతం అదేరోజు ధర్మాసనం వెల్లడించనుంది.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ నిర్భయ సామూహిక అత్యాచారం ఘటనలో ఏడేళ్ల తర్వాత కేసులో దోషులకు శిక్ష పడనుంది. నలుగురు నిందితులు ముకేశ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలకు జనవరి 22న ఉదయం 7 గంటలకు అమలుకావాల్సిన ఉరిశిక్షను ఫిబ్రవరి 1కి వాయిదా వేశారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ ఘటన కేసులో ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దోషులకు మరణశిక్ష తేదీని కోర్టు ఖరారు చేసింది. జనవరి 22వ తేదీన ఆ కామాంధులకు మరణశిక్షను అమలు చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. ఆ రోజు ఉదయం 7 గంటలకు నిందితులను ఉరితీయాలని సమయాన్ని సైతం కోర్టు సూచించింది.
నిర్భయ ఘటనకు నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తయ్యాయి. 2012 డిసెంబర్ 16న నిర్భయపై... దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు... కీచకపర్వానికి పాల్పడ్డారు. దారుణంగా హింసించి అఘాయిత్యం చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
నిర్భయ కేసు విచారణ మళ్లీ వాయిదాపడింది. పటియాలా హౌస్ కోర్టులో నేడు కేసు విచారణ జరగాల్సి ఉంది. ఐతే అడిషనల్ సెషన్ జడ్జ్ సతీష్ కుమార్ అరోరా ఈ కేసు విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేశారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన వారికి ఉరి శిక్ష అమలు చేయాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దిశపై సామూహిక అత్యాచారం, హత్య.. గతంలో నిర్భయ అత్యాచారం, హత్య వంటి ఘటనల అనంతరం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విపరీతమైన ఆగ్రహం వ్యక్తమైంది. నిందితులను కచ్చితంగా ఉరి తీయాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపించాయి. దిశ అత్యాచారం, హత్య కేసులో తెలంగాణ పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేయడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.