కోవిడ్ 19 వ్యాక్సిన్ ( Covid19 Vaccine ) కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తున్న తరుణంలో ఆశాజనకమైన ప్రకటనలు వెలువడుతున్నాయి. నవంబర్ నాటికి వ్యాక్సిన్ రెడీ అంటోంది ప్రముఖ సంస్థ ఫైజర్.
కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) కు వ్యాక్సిన్ ను కనుగొనడంపైనే అందరి దృష్టీ నెలకొంది. ఒకవేళ పరిశోధనలు సత్ఫలితాలనందించాక పరిస్థితి ఏమిటి? మొత్తం ప్రపంచాన్ని ఈ వైరస్ చుట్టేసిన నేపధ్యంలో సరఫరా చేయగలిగే సామర్ధ్యం ఆ కంపెనీలకుందా అసలు? ఈ ప్రశ్నకు సమాధానం బిల్ గేట్స్ ( BillGates ) చెబుతున్నారు. ఒక్క భారతదేశానికే ఆ సామర్ధ్యముందంటున్నారు.
కరోనా వైరస్ కు వ్యాక్సీన్ ఎప్పుడనే దానిపై భిన్నరకాల వాదనలు వస్తున్నాయి. కొందరు ఆగస్టు 15 అంటే..మరి కొందరు సెప్టెంబర్ నాటికంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా...అసలు వాస్తవ పరిస్థితి ఏంటి ? వ్యాక్సిన్ ఎప్పటికి సాధ్యం? ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టులు ఏమంటున్నారు?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.