ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రధాన ఎన్నికల కమీషనర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై అధికారపార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నిస్తోంది.
అమరావతి రాజధాని భూముల కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐడీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లన్నీ టీడీపీ నేత లోకేష్ సన్నిహితులు దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై దాఖలైన పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు..మూడు వారాల్లోగా సమాధానం కోరింది. గతంలో ఇదే పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించడం విశేషం.
కరోనా లౌక్‌డౌన్ నాటినుంచి ఉపాధి లేక ప్రజలు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి.. నెల నెల చెల్లించే ఈఎంఐలు సైతం చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం పండుగ కానుకగా శుభవార్త అందించింది.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Hathras) లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే సిట్ (SIT) కు అప్పగించగా.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ (Central Govt) ఆదేశాలతో ఈ సంఘటనపై కేసు నమోదుచేసిన సీబీఐ (CBI) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఈ సంఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ, బాధితురాలి కుటుంబసభ్యులు, సాక్షుల రక్షణపై సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ను సమర్పించింది.
సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణపై ఆరోపణలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటీషన్ ఇప్పుడు సంచలనం కల్గిస్తోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదులు ఓ పిటీషన్ దాఖలు చేశారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే సిట్ (SIT) కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం (UP Govt) సిఫారసు మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం (Central Govt).. ఈ కేసు దర్యాప్తును సీబీఐ (CBI) కు అప్పగించింది.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో జరిగిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. సిట్ (SIT), సీబీఐ (CBI) కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హత్రాస్ బాధితురాలి కుటుంబానికి, సాక్షులకు రక్షణగా భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
కరోనావైరస్ (Coronavirus) సోకిన తర్వాత హోం క్వారంటైన్లో ఉండకుండా హత్రాస్ ( Hathras ) బాధితురాలి ఇంటికెళ్లిన ఆప్ ఎమ్మెల్యేపై యూపీ పోలీసులు (UP Police) కేసు నమోదు చేశారు. అంటువ్యాధుల చట్టం ( Epidemic Act) కింద ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ (AAP MLA Kuldeep Kumar) పై కేసు నమోదు చేసినట్లు హత్రాస్ ఎస్పీ బుధవారం తెలిపారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో 19 ఏళ్ల యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యోగి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తును ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (( CM Yogi Adityanath) ) మొదట సిట్ (SIT) ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణను సీబీఐ (CBI) కూడా అప్పగించారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో జరిగిన దారుణ ( Hathras incident) సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే అత్యాచారానికి గురై మరణించిన యువతి మృతదేహానికి అర్థరాత్రి బలవంతంగా దహనసంస్కారాలు (Hathras victims cremation ) నిర్వహించడంపై ప్రజలు, విపక్షాలు.. యూపీ పోలీసులు, ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ( UP Govt) అర్థరాత్రి దహన సంస్కారాలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో సుప్రీంకోర్టు (Supreme Court ) కు వివరించింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) పై ఈరోజు (Sep 30) తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం ఈ రోజు తీర్పును ప్రకటించనుండటంతో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన స్వర్ణప్యాలేస్ అగ్ని ప్రమాదం ఘటనపై డాక్టర్ రమేష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే కోవిడ్ నిబంధనల కారణంగా ఆన్ లైన్ విచారణకు హాజరవుతానని సమాధానమివ్వడం చర్చనీయాంశమవుతోంది.
విజయవాడ కోవిడ్ ఆసుపత్రి ప్రమాద ఘటన విచారణకు ఏపీ ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. రమేష్ ఆసుపత్రిపై విచారణ చేయవచ్చంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.
ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ( Prashant Bhushan ) న్యాయవ్యవస్థపై పలు ఆరోపణలు చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం (supreme court) ఒక్క రూపాయి జరిమానా (Prashant Bhushan Fined For RS 1) విధించింది.
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం మరోసారి తన వైఖరి స్పష్టం చేసింది. రాజధాని ఒక్కటే ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని..రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనని సాక్షాత్తూ హైకోర్టుకు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.