విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో పలు ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తంచేసింది. కరోనావైరస్ చికిత్స, ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలపై న్యాయవాది కిషన్ శర్మ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేశారు.
కరోనావైరస్ విషయంలో అమెరికా, చైనా మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. చైనానే కరోనా వైరస్ మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిచేసిందని, అది చైనీస్ వైరస్, వుహాన్ వైరస్ అంటూ చాలా సందర్భాల్లో అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా ఆగ్రహం వెళ్లగక్కారు. అయితే ఈ సారి ట్రంప్ కరోనా విషయంపై మాట్లాడకుండా చైనా వల్ల జరిగిన నష్టం గురించి ప్రస్తావించారు.
lightning strikes | ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాలు ఆ రాష్ట్రాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం పిడుగులు పడి ఆయా రాష్ట్రాల్లో 43మంది మరణించగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
భారతదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు ( India COVID19 cases ) కుప్పలుతెప్పలుగా నమోదవుతున్నాయి. కేవలం శుక్రవారం ఒక్కరోజే గతంలో ఎన్నడూ లేని విధంగా కోవిడ్ (COVID) కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా మృతుల సంఖ్య కూడా పెరగడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో రికవరీ రేటు కూడా పెరగడం కొంచెం ఉపశమనం కలిగిస్తోంది.
8 UP Police Dead: కాన్పూర్: ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని ( Uttar Pradesh's Kanpur ) బీతూర్లో నేరస్థుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు బృందంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో డిప్యూటీ ఎస్పీ, ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లతో సహా ఎనిమిది మంది పోలీసులు అమరులయ్యారు. మరో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు దుండగులను పోలీసులు మట్టుబెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.